” గేమ్ ఛేంజర్ ” విషయంలో ఆ హిట్ మూవీ సెంటిమెంట్ ఫాలో అవుతున్న చరణ్.. వర్కౌట్ అయితే బ్లాక్ బస్టరే..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ గేమ్ ఛేంజ‌ర్ తో సంక్రాంతి బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ కొట్టాలని గ్లోబల్ స్టార్ క‌సితో ఉన్నాడు. ఇక ఈ సినిమాల్లో త్రిబుల్ రోల్లో కనిపించేందుకు చరణ్ ఎంతో కష్టపడినట్లు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక.. ఇప్పటికే సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసిన మేకర్స్.. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. భారీ లెవెల్లో ఈ సినిమా ప్రమోషన్స్ ఉండ‌నున్నాయని సమాచారం. ఇక మొదట అమెరికాలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు టాక్. దానిపై ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు.

అయితే చరణ్ గేమ్ ఛేంజర్‌లో ఓ పాత్రతో భారీ ట్విస్ట్ ఇవ‌నున్నాడ‌ట‌. ఈ మూవీలో చరణ్ పాత్రకు నత్తి ఉంటుందని.. చరణ్ ఓల్డ్ పాత్ర అప్పన్నకు నత్తి ఉండేలా క్యారెక్టర్ డిజైన్ చేశారని తెలుస్తుంది. ఇక గతంలో సుకుమార్ డైరెక్షన్లో చరణ్ హీరోగా వ‌చ్చిన‌ రంగస్థలం సినిమా ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు చెవుడు ఉంటుంది. ఆ మూవీలో నిజంగానే చెవుడు ఉన్న వ్యక్తిగ చరణ్ జీవించేసాడు. ఈ సినిమా తర్వాత చరణ్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు నాన్ థియేట్రికల్ బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసింది.

Rangasthalam (soundtrack) - Wikipedia

ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలోనూ చరణ్ ఇలాంటి సెంటిమెంట్ నే ఫాలో అవ్వాలని భావిస్తున్నాడట. అందుకే అప్పన్న పాత్రకు నత్తి ఉండేలా డిజైన్ చేయించాడని టాక్‌ నడుస్తుంది. ఈ వార్తలు నిజం ఎంతుందో తెలియదు గానీ.. నిజంగానే అప్పన్నగా నత్తి ఉన్న పాత్రలో చరణ్ నటించిన ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే రంగస్థలం సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టే. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.