ఇండస్ట్రీలో హీరోలుగా రాణించాలంటే.. మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలంటే తప్పకుండా బ్యాగ్రౌండ్ ఉండాలని.. నెపొటిజంతో సోలోగా ఎదగటం కష్టం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని వీళ్లంతా అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రానిస్తున్న వారే. వీళ్ళ బాటలోనే తాజాగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ ఒకడు.
హీరోగా, డైరెక్టర్‌గా తన సత్తా చాటుతున్న విశ్వక్.. ఇటీవల మెకానిక్ రాఖీతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమాతో పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న విశ్వక్.. ఇంటర్వ్యూలో తన చదువు గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇక మెకానిక్ రాఖీ మూవీలో సిఎస్సి స్టూడెంట్ గా కనిపించిన విశ్వక్.. రియల్ లైఫ్ క్వాలిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌కు చెందిన దినేష్ నాయుడు అలియాస్ విశ్వక్ 1995 మార్చి 29న జన్మించారు. చాలామందిలా విశ్వక్ కూడా బాలనటుడుగా 2009లో ఎంట్రీ ఇచ్చి.. బంగారు బాబు సినిమాలో మెప్పించాడు.
తర్వాత 2017 లో వెళ్లిపోమాకే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో విశ్వక్‌కు ఊహించిన సక్సెస్ రాలేదు. తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఆడియన్స్ కు సరికొత్తగా పరిచయమైన విశ్వక్.. తర్వాత పాగల్, ఓరి దేవుడో, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాల్లో నటించి తన సత్తా చాటుకున్నాడు. ఆయనలోని ప్రతిభను ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. ఇక తాజాగా మెకానిక్ రాఖీతో ఆడియన్స్ను పలకరించిన విశ్వక్ ఈ సినిమాతో పాజిటీవ్ టాక్ దక్కించుకున్నాడు. ఈ సినిమాలో సీఎస్సీ చదివిన కుర్రాడిగా.. మెకానిక్ గా మెరిసాడు. అయితే ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో విశ్వక్ ను.. సినిమాల్లో సీఎస్సీ కుర్రాడిగా కనిపించిన మీరు రియల్ లైఫ్ లో ఏం చదువుకున్నారు అంటూ ఎదుటి వ్యక్తి ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు విశ్వక్ రియాక్ట్ అవుతూ.. హ్యాపీ డేస్ సినిమా తర్వాత బీటెక్ చేసి చాలామంది మోసపోయారు. కానీ.. నేను బిఏ కమ్యూనికేషన్, బిఏ జర్నలిజం చేశా.. అంటూ వెల్లడించాడు. ఇప్పటికి పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ నేను పాస్ కాలేదని విశ్వక్ వెల్లడించాడు. ఎవరైనా అడిగితే బిఏ డిస్కంటిన్యూ అని చెబుతానని వివరించాడు. ఇక విశ్వక్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రేంజ్ లో సక్సెస్ సాధించడంతో ఇప్పటికే ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోస్ ఆయన్ను ప్రశంసించారు. ఈ ఉత్సాహంతోనే డైరెక్టర్గా కూడా ఆడియన్స్ పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఫలక్ నామా దాస్ సినిమాను తీసిన ఆయన తన దర్శకత్వంతోను ప్రశంసలు అందుకున్నాడు. ఇక విశ్వక్ సేన్‌కు సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం విశేషం.