రిలీజ్ కు ముందే పుష్పరాజ్ సంచలనం.. పుష్ప 2 ఖాతాలో మరో రికార్డ్..

ప్రస్తుతం ఎక్కడ చూస్తున్న పుష్పా ది రూల్ పేరు మూత మోగిపోతుంది. సోషల్ మీడియా అంతా పుష్ప 2 విశేషాలే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లు తెరకెక్కిన ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ఓవర్సీస్‌లో ఒకరోజు ముందే డిసెంబర్ 4.. మేలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఫ్రీ సెల్ బుకింగ్స్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన పుష్ప రాజ్.. మరోసారి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఓవర్సిస్‌లో ఇప్పటి వరకు వేగంగా 50 వేల టికెట్స్ అమ్ముడుపోయిన మొదటి సినిమాగా పుష్ప 2 రికార్డ్‌ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటివరకు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులు అంతా.. ఫ్రీ సెల్ బుకింగ్స్ ఓపెన్ కాగానే టికెట్ల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే హాట్‌ కేకుల్లా పుష్ప 2 సినిమా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇప్పటివరకు ఏకంగా 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు పోస్టర్‌లో వెల్లడించారు మేక‌ర్స్.

KISSIK Lyrical Video | Pushpa 2 The Rule | Allu Arjun | Sukumar | Sreeleela | DSP

ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా 50 వేల టికెట్లు అమ్ముపోయిన‌ సినిమాగా పుష్పరాజ్‌ చరిత్ర సృష్టించాడు. ఇంతే కాదు.. ప్రపంచమంతా తన పాలన గురించి మాట్లాడుకునేలా పుష్ప చేస్తాడు అంటూ పోస్టర్‌లో మేకర్స్ వెల్లడించారు. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక పుష్ప మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని.. పుష్పా 2 ఊచ‌కోత‌ అంతా చూస్తారు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో మొత్తంగా పుష్ప 2 కోసం 3,230 షో లను ప్రదర్శించనున్నారు మేకర్స్. రిలీజ్‌కు ఇంకా సమయం ఉన్న క్రమంలోనే.. సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని టాక్. తాజాగా ఈ సినిమా నుంచి కిస్ కిసిక్కి సాంగ్ రిలీజై ట్రెండింగ్‌గా మారింది.