టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా అమ్మడి పేరు వినిపిస్తూనే ఉంటుంది. తన పర్సనల్ విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి ఫ్యామిలీని ఎదిరించి మరీ వివాహం చేసుకున్న క్షజ అప్పట్లో తమ పెళ్లి కోసం మీడియా ముందు పెద్ద రచ్చ చేసింది. అప్పట్లో వీరిద్దరి పెళ్లి న్యూస్ పెద్ద సంచలనం. ఆ సమయంలోనే శ్రీజ.. తన తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ లపై కూడా అనుచిత ఆరోపణలు చేస్తూ ఫైర్ అయింది.
ఇక భరద్వాజ్‌తో పెళ్లయిన కొన్నేళ్లపాటు లైఫ్ హ్యాపీగానే సాగినా.. వీరికి కూతురు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. తర్వాత శ్రీజను మెగాస్టార్ హక్కును చేర్చుకున్నారు. కొంతకాలానికి శ్రీజ.. కళ్యాణ్ దేవ్‌ని వివాహం చేస్తుంది. వీరిది పెద్దలు కుదిరిచిన వివాహమే. వీరికి కూడా ఓ పాప పుట్టింది. తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్‌కు కూడా దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో విడాకులు తీసుకున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న ఈ విషయంపై ఇప్పటివరకు శ్రీజ, కళ్యాణ్ ఇద్దరు రియాక్ట్ కాలేదు. సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన ఫోటోలను మాత్రమే డిలీట్ చేశారు.
దేంతో ఇద్దరు విడిపోయారని వార్తలు వినిపించాయి. అయితే తర్వాత శ్రీజ మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుందంటూ కూడా ఎన్నో రకాలుగా రూమర్లు వచ్చిన ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని చివరకు తేలిపోయింది. ప్రస్తుతం శ్రీజ తన ఇద్దరు పిల్లలతో తండ్రి చిరంజీవి ఇంట్లోనే కలిసి ఉంటుంది. కాక కొన్ని రోజుల క్రితం శ్రీజ మొదటి భర్త భరద్వాజ్ అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే. శ్రీజ తో విడాకులు తర్వాత భరద్వాజ్ వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న భరద్వాజ్.. ఇటీవల తుదిశ్వాస విడిచాడు. అయితే భరద్వాజతో.. శ్రీజ విడాకులకు గల కారణం వరకట్న వేధింపులు అని జోరుగా ప్రచారం జరగడంతో దీనిపై రియాక్ట్ అయిన భరద్వాజ్.. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటే క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం శ్రీజ జీవితం అంత అల్లకల్లోలంగా ఉంది. కళ్యాణ్ దేవ్ శ్రీజకు నిజంగానే విడాకులు అయ్యాయా లేదా.. ఫ్యూచర్ లో మరోసారి వివా చేసుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.