ప్రస్తుతం టాలీవుడ్ సినీ దిగ్గజాలు.. స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సీనియర్ నటులలో బాలయ్య, నాగార్జున, వెంకటేష్ పేర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈ ముగ్గురు కూడా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ తమ సినిమాలతో ఆడియన్స్ను పలకరిస్తూనే ఉన్నారు. ఇలా వీళ్ళ ముగ్గురు కూడా తమ కెరీర్‌లో ఎన్నోసార్లు ఒకే జానెర్ కు సంబంధించిన సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న సందర్భాలు ఉన్నాయి.
అలా ఈ ముగ్గురు స్టార్ హీరోలతో ఒకే జానెర్లో నటించి మూడు సినిమాలు తో హిట్ కొట్టిన ఓ హీరోయిన్ నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. వీళ్ళు ముగ్గురు నటించిన ఆ ఒకే జానెర్ మూవీలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. తమ సినీ కెరియర్ లో ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఎన్నో రకాల పాత్రలు నటించి మెప్పించారు. అందులో పోలీస్ గెటప్ కూడా ఒకటి. ఎన్నో సినిమాల్లో వీళ్ళు ముగ్గురు పోలీస్ ఆఫీసర్లుగా కనిపించి తమ అద్భుత నటనతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకున్నారు. అలాగే ముగ్గురు పోలీస్ పాత్రలో నటించిన సినిమాలలో.. ఒకే హీరోయిన్ వీరితో జతకట్టి ఆ సినిమాలన్నీటితో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందట. ఆమె మరెవరో కాదు అసిన్.
ఇంతకి.. అసిన్ నటించిన ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. నందమూరి నటసింహ బాలకృష్ణ చాలా ఏళ్ల క్రితం లక్ష్మీనరసింహా అనే సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో బాలయ్య సరసన అసిన్ మెరిసింది. బాలయ్య సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. ఇక నాగార్జున గతంలో పూరి జగనన్న డైరెక్షన్లో శివమణి సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలోని అసిన్ హీరోయిన్గా కనిపించింది. ఇందులోను నాగార్జున పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. అప్పట్లో ఎన్నో రికార్డులను సృష్టించింది.
టాలీవుడ్ క్రేజీ హీరో విక్టరీ వెంకటేష్ అభిమానులు అయని వెంకీ మామ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఇక వెంకటేష్ కూడా గతంలో గౌతమినన్ డైరెక్షన్లో ఘర్షణ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ స్టోరీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో అసిన్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇలా బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ముగ్గురు హీరోలతోనూ పోలీస్ ఆఫీసర్ స్టోరీస్ లో నటించి మంచి సక్సెస్ అందుకుంది. అమ్మడి నటనకు ప్రేక్షకుల నుంచి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి.