ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయినా.. సాధరణ వ్యక్తులైన రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం.. ఒకొరికొక్కరు ప్రేమగా విషెస్ తెలియజేసుకోవడం సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. అది లవర్స్ అయినా భార్యా, భర్తలైన, కొన్ని సందర్భాలను సెలబ్రేట్ చేసుకుంటూ ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అలాగే నాగచైతన్య, సమంత విషయంలో కూడా జరిగి ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో సామ్.. నాగచైతన్యకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి ఉండవచ్చు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఆమె చెప్పినట్లు నిజంగానే అమ్మే బహుమతులు ఇచ్చిందే అనుకుందాం. కానీ.. వాటిపై పబ్లిక్‌గా రియాక్ట్ అయ్యిన విధానం ప్రస్తుతం అక్కినేని ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తుంది.
పబ్లిక్ గా నా ఎక్స్ కు ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చాను అని చెప్పడమే కాదు.. వృధా అంటూ కామెంట్స్ చేసింది. సమంత ఓదానిపై భారీగా ఖర్చుపెట్టి.. తర్వాత అనవసరంగా వృధా చేసామని ఎప్పుడైనా ఫీలయ్యారా.. అనే ప్రశ్నకు ఆమె రియాక్ట్ అవుతూ.. అసలు ఆలోచించకుండా నా మాజీకి ఇచ్చిన ఖరీదైన బహుమతులు అంటూ సమాధానం చెప్పింది. లైఫ్ లాంగ్ కలిసి ఉంటామని ఆలోచనతో నాగచైతన్య.. సమంత ఒకరికి ఒకరు ఇచ్చుకుని ఉండవచ్చు. అయితే తర్వాత వీరిద్దరి బంధం తెగిపోయింది. ఇలాంటి సందర్భంలో అతనికి ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్స్ అన్ని వృధా అయ్యాయి అంటూ సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ విషయంలో ఆమె భారీగా ఖర్చు చేశానంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం దీనిపై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సమంతని వాళ్ళు రివర్స్ లో ప్రశ్నిస్తూ.. మరి నువ్వు ఇచ్చిన కాస్ట్లీ గిట్ల లెక్క చెప్పావు.. నాగచైతన్య గిఫ్ట్ లెక్క తేల్చవేంటి అంటూ.. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ లైఫ్ లో చైతన్య కూడా నీకు ఖరీదైన బహుమతులు ఇచ్చే ఉంటాడు కదా.. మరి వాటి గురించి ఎప్పుడూ మాట్లాడవెందుకు.. నువ్వు ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ ల గురించి మాత్రమే ఆరోపిస్తున్నావు.. అంటూ మండిపడుతున్నారు. నిజానికి ఏ రిలేషన్లో అయినా అమ్మాయి కంటే ఎక్కువగా అబ్బాయిలే బహుమతిలిస్తూ ఉంటారు. సమంత విషయంలో కూడా చైతూ ఇంతకంటే ఎక్కువ కాస్ట్లీ బహుమతులు ఇచ్చి ఉంటాడు. అలాంటప్పుడు నాగచైతన్య.. ఇచ్చిన్న కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా వృధా అయినట్లేగా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.