ఏడుపదుల వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తూ.. స్టార్ హీరోగా దూసుకుపోతూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చి మరి రికార్డ్ స్థాయిలో వసూళ్ళను కొల్లగొడుతున్న హీరోలు ఎవరంటే.. టాలీవుడ్ లో టక్కున వినిపించేది మెగాస్టార్ చిరు పేరే. ఇక తమిళ్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు మొదట వినిపిస్తుంది. ఈ వయసులోనూ తమదైన స్టైల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నఈ ఇద్దరూ ఇప్పటికీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూనే ఉన్నారు. మరో పదేళ్లయినా వీరి క్రేజ్ ఏమాత్రం తగ్గదనడంలో సందేహం లేదు. ఏజ్ జస్ట్ నెంబర్ అనే డైలాగ్ వీరిద్దరికీ బాగా సెట్ అవుతుంది.
ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీబిజీగా గడుపుతున్నారు. కానీ గతంలో వీరిద్దరూ కలిసి.. రెండు సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ రోజుల్లో వీళ్ళ కాంబోలో ఖాళీ, బందిపోటు సింహం లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత ఇద్దరికీ స్టార్ స్టేటస్ దక్కడంతో మళ్ళీ కలిసిన నటించడానికి వీలుపడలేదు. అయితే 1989లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తమిళ్ మూవీ ” మాపిళ్ళై ” సినిమాను రజినీకాంత్ తో తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ అందుకున్న.. అత్తకు యముడు అమ్మాయికి మొగుడికి రీమేక్ గా వచ్చింది.
ఇక ఈ సినిమా తెలుగులో ఎలాంటి సక్సెస్ అందుకుందో.. తమిళ్లో కూడా అంతే పెద్ద ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది. సుమారు 200 రోజులు తమిళ్ థియేటర్స్ లో ఈ సినిమా నిరంతరాయంగా ప్రదర్శించబడింది. అయితే ఈ సినిమాకు సమర్పకుడిగా చిరంజీవి వ్యవహరించడం విశేషం. అంతే కాదు.. ఇందులో మరో షాకింగ్ విషయం ఏంటంటే.. తమిళ్ వర్షన్ క్లైమాక్స్ లో చిరంజీవి ఓ స్పెషల్ గెస్ట్ గాను కనిపించారు. అల్లు అరవింద్.. చిరంజీవి బావే కనుక సినిమాకు ఆయన పేరు జత చేస్తే మరింత హైప్ వస్తుందనే ఉద్దేశంతో చిరంజీవిని ఆయన రిక్వెస్ట్ చేశారట. మెగాస్టార్ కూడా దానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమాల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్య అమల హీరోయిన్గా నటించి మెప్పించింది.