టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా పుష్ప సినిమాతో ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప 2 మోస్ట్ ఏవైటెడ్ మూవీగా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్నో ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తున్నాడు పుష్పరాజ్. అలా.. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షో లో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ తన ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చి సందడి చేశాడు. ఇక తన కూతురు అర్హ ఓ తెలుగు పద్యం తడబడకుండా పల్లు పోకుండా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
అదే టైంలో బన్నీ కూడా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను ఓపెన్గా షేర్ చేసుకున్నాడు. తన లైఫ్ లో తీరని కోరిక ఉండిపోయిందని వెల్లడించాడు. ఇక అల్లు అర్జున్ కెరీర్‌లో గంగోత్రి మంచి సక్సెస్ అందుకున్నా.. ఈ సినిమాతో ఆయనకు ఎలాంటి ఇమేజ్ క్రియేట్ అవ్వలేదు. కానీ.. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఆర్య సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ కావడంతో తర్వాత ఆయనకు వరుస ఆఫర్లు క్యు కట్టాయి. ఈ క్రమంలోనే ఆయన ఆర్య సినిమా గురించి తన ప్రతి ఇంటర్వ్యూలను ప్రస్తావిస్తూ ఉంటారు. అలా తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ లోను బాలయ్య ఎదుట బన్నీ.. ఆర్య మూవీ గురించి మాట్లాడారు.
తన లైఫ్ లో మర్చిపోలేని సినిమా ఆర్య అంటూ చెప్పిన బన్నీ.. ఈ సినిమాలో తన తీరని కోరిక ఒకటి ఉండేదని వెల్లడించాడు. ఈ సినిమాలో తన తాత అల్లు రామలింగయ్య పాత్ర ఒకటి ఉంటే బాగుండేది.. ఎప్పటికీ గుర్తుండిపోయేది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తనకు నేషనల్ అవార్డు వచ్చిన టైంలో తాత ఉంటే ఎంతో సంతోషించే వాడని వివరించారు. ఇక తన లైఫ్ ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడానికి కారణం తాతేనని చెప్పిన బన్నీ.. గంగోత్రి, ఆర్య మూవీస్ సక్సెస్ అయిన సమయంలో తాత నన్ను చూసి తెగ మురిసిపోయేవాడు అంటూ వెల్లడించాడు.
ప్రస్తుతం బన్నీ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం.. బన్నీ నుంచి వస్తున్న పుష్ప 2తో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటూ.. పార్ట్1ను మించిన రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ అందుకుని రికార్డు క్రియేట్ చేస్తుందంటూ.. పుష్పరాజ్ ప్రభంజనం సృష్టిస్తాడు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయిన తరువాత ఆడియన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.