టాలీవుడ్ యంగ్ హీరోలకు నెపోటిజం వల్లే దెబ్బ పడుతుందా. .?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా అడుగుపెట్టి తమని తము స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే లక్ష్యంగా కృషి చేస్తూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. మంచి కథలను ఎంచుకోవడమే కాదు.. దర్శకులతో సరికొత్త తరహా సినిమాలను చేయడానికి కూడా ఆసక్తి చూబుతూ ఉంటారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఎదగాలంటే కీలక పాత్ర పోషించేది సక్సెస్. సక్సెస్ ఉన్నవాళ్లకే ఎక్కువ క్రేజ్ లభిస్తుంది. ఆ హీరోల సినిమాలు చూడడానికి ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందుకే సక్సెస్ ఫార్ములా చాలా గొప్పది అని అంతా చెబుతుంటారు.

Young Heroes Decide To Not Produce Anymore!

అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కూడా ఒకప్పుడు స్టార్ హీరోలుగా రాణించిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ.. ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో నెపొటిజం విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోల కెరీర్ పై దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కారణం ఏంటంటే.. నెపాటిజం కారణంగా యంగ్‌ హీరోలకు వచ్చే అవకాశాలు కూడా.. అందకుండా పోతున్నాయట. ఆ కథలను కూడా స్టార్ కిడ్స్ తీసుకుంటూ సినిమాల్లో నటించి ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక దాంతో ఇప్పుడున్న యంగ్ హీరోలకి అంత మంచి అవకాశాలు రావడం లేదని.. కథ‌లు లేక సతమతమవుతున్నారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు కూడా ఏదో ఒక బ్యాక్ డ్రాప్ తో వారసత్వంతో వచ్చిన వాళ్లే. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోను నెపోటిజం ఎప్పటికప్పుడు మరింతగా పెరుగుతూ వస్తుందని.. దాన్ని తగ్గించడం ఎవరివల్ల కాదంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న యంగ్ హీరోలు కూడా స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకుంటే.. రేపు తమ వారసులుగా కూడా నెక్స్ట్ జనరేషన్ హీరోలను ఇండస్ట్రీలోకి దింపుతారు.

Who is the highest-paid Telugu hero in 2024? - IBTimes India

అలా ఇండస్ట్రీలో వారసత్వం పెరుగుతుంది కానీ.. కొత్త హీరోలకు అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయని.. ఇది అన్ని ఇండస్ట్రీలలోను ఎక్కువగా వినిపిస్తున్న వాదన. అయితే ఇందులో వాస్తవం ఉన్న.. మరి కొంతమంది మాత్రం నెపొటిజంతో వచ్చినా సరే.. టాలెంట్ ఉంటేనే వారు సక్సెస్ సాధిస్తారని.. చాలామంది యంగ్ హీరోలు కూడా తమ ఎంచుకునే కంటెంట్తో సక్సెస్ అందుకుంటున్న వారు ఉన్నారని.. బ‌డా బ్యాక్‌గ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చాలామంది తమ సత్తా చాటుకోలేక మిగిలిపోయారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. వాటిని అందిపుచ్చుకొని సక్సెస్ సాధించడం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడ స్టార్ హీరోస్గా ఎదగొచ్చు అని మరి కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.