మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోలోగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. రూ.560 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా టాలీవుడ్ తో పాటు యూఎస్ లోను భారీ సక్సెస్ అందుకుంది. నార్త్‌లో సైతం.. సత్తా చాటిన దేవర.. బాలీవుడ్ వర్షన్ రూ.60 కోట్ల నెట్ వసూళ్ళు రాబట్టింది. మిక్స్‌డ్ టాక్ తోనే అక్కడ దేవర ఈ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టిందంటే.. ఇక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండేవా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా దేవార ప్రొడ్యూసర్లకు లాభాలు కురిపించింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూట్‌లో హృతిక్ రోషన్తో కలిసి సందడి చేస్తున్నాడు. భారీ పాన్ ఇండియన్ మల్టీస్టారర్‌గా రానున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొన్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో హృతిక్, తారక్ పోటీ పడి మరి డాన్స్ స్టెప్పులతో అదరగొట్టారని టాక్. ఈ ఏడాది చివర్లోనే వార్ 2 థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఇక ఈ సినిమా అనంతరం.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో తారక్ మరో సినిమా చేయబోతున్నాడు. సలార్‌కు ముందు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రావాల్సి ఉంది. కానీ.. ఆర్‌ఆర్ఆర్ నుంచి రావడానికి ఆలస్యం అవ్వడంతో.. ప్రశాంత్ – ప్రభాస్ కంబోలో సలార్ పూర్తి చేశాడు.
ఇక మాఫియా బ్యాక్ డ్రాప్ లో తారక్ సినిమా తెరకెక్కనుంది. చైనా, భూటాన్ దేశాలను గడగడలాడించిన డ్రగ్ మాఫియా జీవిత ఆధారంగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందించనున్నాడని టాక్. ఇక ఈ సినిమాలో విలన్ గా ఓ సూపర్ స్టార్‌ని తీసుకోబోతున్నాడట. ఇండియాలోనే బిగ్గెస్ట్ హీరోగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న బాలీవుడ్ నటులలో అమీర్ ఖాన్ ఒకడు. ఇండియా వైడ్ పాపులాటి దక్కించుకున్న అమీర్ ఖాన్.. ఎన్టీఆర్ మూవీలో విలన్ గా కనిపించబోతున్నాడని.. దీనికోసం అమీర్ ఖాన్.. ప్రశాంత్ నీల్‌ను కూడా అప్రోచ్ అయినట్లు సమాచారం. అమీర్ ఖాన్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. ఒకవేళ ఇదే నిజమైతే అమీర్, తారక్ కాంబో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేయడం ఖాయం అనడంలో అతిశయోక్తి లేదు.