టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల దేవరతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు తారక్. ఈ సినిమా షూట్ పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌పైకి రానుంది. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. డ్రాగన్ ద్వారా అయినా స్టార్ హీరో గానే కాదు.. పాన్ ఇండియా లెవెల్లోనే తను ఓ మంచి నటుడిగా ఎస్టాబ్లిష్ చేసుకుని ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.
ఏది ఏమైనా ఇప్పటికే ఎవరికి అందని రేంజ్ లో దూసుకుపోతున్న తారక్.. ఎలాంటి పాత్రనైనా పరకాయ ప్రవేశం చేసి మరి నటిస్తు ఆకట్టుకుంటున్నాడు. కానీ.. ఎన్టీఆర్ కెపాసిటీకి సరిపడా సినిమా అయితే ఇప్పటివరకు రాలేదు. అందుకే ఆయనకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా అందలేదు. నిజానికి తారక్‌కు ఉన్న నటచాతుర్యానికి.. మంచి కథ ఉన్న సినిమా పడితే ఇండస్ట్రియల్ హిట్ కాదు బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవుతుందనటంలో సందేహం లేదు. అయినప్పటికీ ఆయనకు ఇప్పటివరకు సరైన కథ రాకపోవడం ఒక్క ఇండస్ట్రియల్ హిట్ కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఏదేమైనా తారక్ లాంటి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ తో పోటీ పడడం అంటే సాధారణ విషయం కాదు. అయిన తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉన్న తారక్.. ప్రశాంత్ నీల్‌కు ఆ బాధ్యతలో అప్పగించాడు. మరి తారక్ తన పెట్టుకున్న నమ్మకాన్ని నీల్ ఎంతవరకు నిలబెడతాడో..తారక్‌కు తన సినిమాతో అయినా ఒక భారీ ఇండస్ట్రియల్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి.