కొన్ని సినిమాలు రిలీజై ఎంతకాలమైనా ఎక్స్పైర్ డేట్ అనేది ఉండదు. అలాంటి వాటిలో మహేష్ బాబు ఒక్కడు మూవీ ఒకటి. ఫిల్మీగ్రఫీలో ఒక్కడు సినిమాకు అలాంటి ఇమేజ్ దక్కింది. అసలు ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే.. ఎంతోమంది బుల్లితెరకు అతుక్కుపోయి మరి సినిమాను చూస్తుంటారు. అంతలా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా లో పాతబస్తీని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారు. ఇక కర్నూలు కొండారెడ్డి బురుజు గురించి అయితే ఈ సినిమాతో అందరికీ క్లారిటీ వచ్చింది.
అంతలా సినిమా తెలుగు ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో పాటలు, ఫైట్స్, గుణశేఖర్ మేకింగ్, అలాగే నటినట్టులా యాక్టింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఆర్ట్ ఆడియన్స్‌ను మెప్పించింది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన వారందరికీ మంచి క్రేజ్ వచ్చింది. అలాంటి వారిలో మహేష్ బాబు చెల్లెలుగా నటించిన నిహారిక ఒకటి.
ఈ సినిమాలో తన నటనతో మంచి ఇమేజె క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు సినిమా సక్సెస్ అందుకోవడంతో వేరే లెవెల్‌లో పాపులారి దక్కించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్కడు సినిమా కంటే ముందే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. అయితే ఒక్కడుతో మంచి పాపులారిటీ వచ్చిన తర్వాత.. అవకాశాలు వచ్చినా నో చెప్పి చదువుపై ఫోకస్ చేసింది. ఇండస్ట్రీకి దూరమైంది. స్టడీస్ కంప్లీట్ కాగానే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న అబ్బాయిని వివాహం చేసుకొని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఈ అమ్మడుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.