ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుని స్టార్ సెలబ్రిటీస్‌గా దూసుకుపోతున నటులలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ బాహుబలిలో.. కట్టప్ప పాత్రలో నటించి ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న సత్యరాజ్.. ఈ సినిమాలో తన పాత్రకు ప్రాణం పోశారు. అయితే గతంలోనే ఎన్నో సినిమాల్లో సత్యరాజ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోను పలు సినిమాలోని ఆకట్టుకున్నాడు. ఇంతకీ ఈ పై ఫోటోలో సత్యరాజ్ తో ఉన్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..?
అతను కూడా ఓ స్టార్ సెలబ్రిటీ. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఆ కుర్రాడు ఎవరో కనిపెట్టడం కాస్త కష్టమే. సరే మేమే చెప్పేస్తాం లెండి. అతనే పాహద్ ఫాజిల్. మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్న ఈ స్టార్ నటుడు.. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈయన తండ్రి పాజిల్ కూడా ఇండస్ట్రీలో దర్శకుడుగా రాణించారు. ఇక ఫాహద్ మొదటి సినిమాకైయతుమ్‌కు ఆయన తండ్రి దర్శకుడుగా వ్యవహరించాడు. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా.. బ్లాక్ బస్టర్ మూవీ బెంగళూరు డేస్ లో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.
ఈ సినిమాతో ఈయన క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇక కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ పుష్పలోను విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను భయపెట్టాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. దీంతో తెలుగు ప్రేక్షకులలోను ఈయనకు మంచి ఇమేజ్ ఏర్పడింది. ఇప్పుడు పుష్ప 2 తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు విలనిజం కూడా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వర్సటైల్ యాక్టర్ గా మంచి ఇమేజ్ తో రాణిస్తున్నాడు.