అసలు నిన్ను ఎవరు చూస్తారు అంటూ స్టార్ హీరోయిన్ ని ఇన్సెల్ట్ చేసిన ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మ్యాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తన నట‌న‌, డ్యాన్స్‌, డైలాగ్ డెలివ‌రీతో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్.. తన సినీ కెరీర్‌లో సీనియర్ హీరోయిన్ నుంచి నేటితరం హీరోయిన్ల వరకు ఎంతో మందితో నటించి మెప్పించాడు. తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. అయితే నందమూరి హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఆడవాళ్లకు ఎంతో గౌరవం ఇస్తాడని.. వారితో ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడని ఎన్టీఆర్ పై పాజిటివ్ టాక్ ఉంది.

Prime Video: Adhurs

ఇప్పటివరకు ఆయనతో పని చేసిన కోస్టార్స్ కూడా చాలామంది ఇదే విషయాన్ని వెల్లడించారు. అలాంటి ఎన్టీఆర్.. గతంలో ఓ స్టార్ హీరోయిన్‌ను అసలు నిన్ను ఎవరు చూస్తారు అంటూ ఎద్దేవా చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎన్టీఆర్ ఏ హీరోయిన్‌ని చూసి అలాంటి కామెంట్స్ చేశారా.. అసలు కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఎన్టీఆర్ హేళనగా మాట్లాడిన హీరోయిన్ ఎవరో కాదు సౌత్ స్టార్ బ్యూటీ నయనతార. ఎస్ నయనతారనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎన్టీఆర్ తో కలిసి అదుర్స్ సినిమాలో న‌టించింది. చారి గెటప్ లో నటించిన ఎన్టీఆర్ కు జంటగా నయనతార సినిమాల్లో పాత్రను పోషించింది.

Nayanthara hikes remuneration after wedding

ఇక ఓ ఈవెంట్‌లో న‌య‌న్ దీనిగురించి ఆసక్తికర కామెంట్ చేసింది. అదుర్స్ షూటింగ్ టైంలో నేను మాటిమాటికి టచ్ అప్ చేసుకుంటున్న.. అలా టచ్ అప్ చేసుకుంటూ లిప్స్టిక్ రాసుకుంటున్న క్రమంలో తారక్ నా పక్కన నిలబడి అలాగే చూస్తూ ఉండిపోయారు. ఏంటి అలా చూస్తున్నారని నేను ప్రశ్నించగా.. ఎందుకు అంతలా మేకప్ వేసుకుంటున్నావ్‌ అని నన్ను ప్రశ్నించారని.. నేను షార్ట్ లో అందంగా కనిపించాలి కదా అని రెస్పాండ్ అయ్యా.. దాంతో నువ్వు ఎంత మేకప్ వేసుకున్న జనాలు నిన్ను చూడరు.. నన్నే చూస్తారు అన్నారని.. దాంతో నాతోపాటు సెట్లో ఉన్న వారంతా సరదాగా నవ్వుకున్నారు.. మరి మన చారి లుక్ గెటప్ అలాంటిది అంటూ న‌య‌న్‌ నవ్వుతూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం నయన్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.