సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా సక్సెస్ కావాలంటే కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందాల్సిందే. అప్పుడే నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను మెచ్చి సినిమాకు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుతుంది. లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మహిళా ప్రేక్షకులు కూడా సినిమాకు రావాల్సి ఉంటుంది. ఇక లేడీస్ ఒక సినిమాను పూర్తిగా రిజెక్ట్ చేస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టడం అనేది చాలా కష్టతరం అవుతుంది. అసలు అది సాధ్యం కాదు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించారు సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ. లేడీ ఆడియన్స్ ఎవ్వరూ రాకపోయినా కృష్ణ నటించిన సినిమా థియేటర్లలో సంచలన విజయాన్ని సాధించింది. పెట్టిన బడ్జెట్‌కు నాలుగింతలు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో.. ఆ డీటెయిల్స్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం.
అదే ఇండియాలో వచ్చిన మొట్టమొదటి వెస్ట్రన్ ఫిలిం మోసగాళ్లకు మోసగాడు. శ్రీ పద్మాలయ మూవీస్ బ్యానర్ పై కృష్ణ సోదరులు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా.. టెక్నికల్ వాల్యూస్ తో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకోకుండా రూపొందింది. చాలా థియేటర్లలో ఏకంగా 100 రోజులు ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అలా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు ఈ మూవీ క్రియేట్ చేసిన బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గురించి గతంలో ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కృష్ణ ఈ సినిమాలో ఎన్నో అడ్వెంచర్స్ చేశాడు.. కానీ సినిమా మేము తీయాలని నిర్ణయించుకోవడం పెద్ద సాహసం అంటూ వివరించాడు. అలాగే కౌబాయ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీయడం మొదలుపెట్టింది కూడా కృష్ణనే అంటూ వెల్లడించడు.
గుడ్ బాడ్ అండ్ అగ్లీ సినిమా నుంచి ఆయన తెలుగు నేటి వీటితో సినిమాను చేయాలని భావించాడని.. ఆరుద్రకు అదే విషయం వివరించగా తెలుగులో క్యారెక్టర్స్ మార్చాలని చెప్పాడని ఇంకెందుకు ఆలస్యం సినిమా కథ సిద్ధం చేయండి అంటూ కృష్ణ ఆరుద్రకు ఆర్డర్ వేశాడని.. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆరుద్ర.. నెల రోజుల్లో మోసగాళ్లకు మోసగాడు సినిమా స్టోరీని రెడీ చేసి కృష్ణకు వినిపించారని చెప్పుకొచ్చాడు. కృష్ణకు స్టోరీ నచ్చడంతో షూటింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా రూ. 7 లక్షల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ చూసి రూ.15 లక్షలు బడ్జెట్ అయి ఉంటుందని అంత భావించారట. ఆ రేంజ్ లో ఏడు లక్షలతో సినిమాలు తెరకెక్కించారు కృష్ణ.
ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్కు ఓ రోజు నిర్మాత నాగిరెడ్డి వెళ్ళి షూట్ అంతా పరిశీలించిన ఆయన.. ఇలాంటి సినిమాలు తెలుగు ఆడియన్స్ చూడడం కష్టమే అంటూ కామెంట్స్ చేశారట. కృష్ణకు కూడా దీంతో కాస్త భయం వేసి ఎన్టీఆర్ జడ్జిమెంట్ తీసుకుందామని భావించిన ఆయన ఎన్టీఆర్కు సినిమా వేసి చూపించారు. అది చూసి ఎన్టీఆర్ ఫిదా అయిపోయారు. ఇది మాస్ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుంది. కానీ.. లాంగ్ రన్ ఆశించలేము. లేడి ఆడియన్స్ వచ్చే అవకాశం ఉండదంటూ వెల్లడించాడట. అయినా కృష్ణ భయపడకుండా సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నాడు. అయితే అన్నగారు చెప్పినట్టే సినిమాకు మహిళా ప్రేక్షకులు ఎవరు రాలేదట. కానీ మగవారు మాత్రం భారీ సంఖ్యలో హాజరవడంతో సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అలా కృష్ణ చేసిన ప్రయోగం సక్సెస్ అయి బడ్జెట్‌కు నాలుగింతల కలెక్షన్లు కూడా వసూలు అయ్యాయి.