యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జీన్వీకపూర్ హీరోయిన్గా నటించిన దేవర సెప్టెంబర్ 27న భారీ అంచనాల నడుమ రిలీజైన సంగతి తెలిసిందే. అలా దేవరా మొదటి రోజునుంచే వసూళ ఊచకోత కొనసాగుతుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.175 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టిన దేవర.. రెండో రోజు కూడా దాదాపు అదే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది. దాదాపు అన్ని సెంటర్లోనూ సూపర్ కలెక్షన్లతో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న దేవర.. పోటీగా మారే పెద్ద సినిమా దసరా కానుకగా రిలీజ్ కాకపోవడంతో మరింత అడ్వాంటేజ్‌తో దూసుకుపోతుంది.
అలా దేవర ఈ ఏడు రోజులు ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో కలెక్షన్స్ సాధించిందో.. దేవర ఫస్ట్ వీక్ లేటెస్ట్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆరవ రోజుకి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. జీఎస్టీ లేకుండానే ఏకంగా రూ.2.92 కోట్ల కలెక్షన్లను కల్లగొట్టిన దేవర.. రిలీజ్ రోజు నుంచి మొదటివారం పూర్తయ్యేసరికి సొంతం చేసుకున్న కలెక్షన్ లెక్కలు ఇవే.
దేవర రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి రోజు రూ.61.65 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టగా.. రెండో రోజు రూ.18. 22 కోట్లు, మూడో రోజు రూ.19.11 కోట్లు, నాలుగవ రోజు రూ.6.2 కోట్లు, ఐదవ రోజు రూ.6.19 కోట్లు, ఆరవ రోజు రూ.9.48 కోట్లు, ఏడవ రోజు రూ.2.92 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. ఇలా మొత్తం మీదగా ఏడు రోజుల్లో ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి రూ.123.58 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది.