ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా మూవీ పుష్ప 2. మోస్ట్ అవైటెడ్‌గా టాలీవుడ్ అభిమానులతో పాటు.. నార్త్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో డిసెంబర్ 6న రిలీజ్ చెయ్ అన్న సంగతి తెలిసిందే . ఇక ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. కాగా గతంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది.
గతంలో పుష్పాకు నార్త్ బెల్ట్ లో ఏ స్టార్ హీరో కూడా క్రియేట్ చేయలేని రికార్డ్స్ సొంతమైంది. పుష్ప గాడి మేనరిజం అక్కడ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రేక్షకులంతా పుష్ప 2 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు కూడా అక్కడ భారీ రేంజ్ లో జరిగాయని సమాచారం. ఈ క్రమంలోనే సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఒక పక్కన బిజినెస్ లెక్కలు చూస్తే.. పుష్ప గాడి క్రేజ్ ఎలా ఉందో.. బన్నీ మానియా ఏంటో అర్థం అయిపోతుంది.
పుష్ప 2 కోసం పాన్ ఇండియా మార్కెట్లో ఓ రేంజ్ లో చర్చ నడుస్తుంది. ఇలాంటి క్రమంలో మరోసారి ఆన్లైన్ సినిమా బుకింగ్ ప్లాట్ఫారంలో పుష్పగాడి రూలింగ్.. చూపించాడు. పుష్పరాజ్ క్రేజ్ శిఖరాన్ని దాటింది. బుక్ మై షో అలాగే పేటీఎంలో కలిపి ఏకంగా ఏడు లక్షల ఇంట్రెస్ట్ ని పుష్ప 2పై నమోదు చేసుకోవడం విశేషం. ఇక సినిమా రిలీజ్ కి చాలా కాలం ఉన్నప్పటికీ.. ఈ గ్యాప్ లోనే సినిమా సెన్సేషన్ ని క్రియేట్ చేసిందంటే.. పుష్పరాజ్ మ్యానియా ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.