ఒక్కో సినిమాకు రు. 4 కోట్లు అడిగిన పూజా రేటు ఢ‌మాల్‌… బాగా త‌గ్గించేసిందే…?

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించిన వారిలో పూజా హెగ్డే కూడా ఒకటి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. వ‌రుస స‌క్స‌స్‌లు రావ‌డంతో రెమ్యూనరేషన్ ను కూడా అంచలంచగా పెంచుతూ వచ్చింది. గ్లామర్ షోలతో కుర్రకారుకు హీటెక్కిస్తూ.. విపరీతంగా ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇండస్ట్రీలో ఎంత త్వరగా స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్‌ క్రియేట్ చేసుకుందో.. అంతే వేగంగా వరుస ప్లాప్‌ల‌తో ఐరన్ లెగ్‌గా ముద్ర వేసుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి.

Pooja Hegde (@hegdepooja) • Instagram photos and videos

అయితే ప్రస్తుతం రేస్‌లో బాగా వెనుకబడిన పూజ హెగ్డే.. తాజాగా రెమ్యూనరేషన్ తగ్గించిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అమ్మ‌డి కెరీర్‌లో ఎన్ని ప్లాప్‌లు వచ్చినా.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా అధైర్య పడకుండా.. స్ట్రాంగ్ గా నిలబడి భారీ సక్సెస్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ని కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. అయితే ఈ సినిమా తన లైఫ్ లో టర్న్ చేస్తుందని భావిస్తుంది పూజా. ఇక ఈ సినిమాతో సక్సెస్ అందుకొని మరోసారి త్రో బ్యాక్ తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాల్లో ఉంది.

Pooja Hegde: 'I didn't do Bollywood films because the offers were not  exciting' – Firstpost

కాగా గతంలో నాలుగు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న పూజ హెగ్డే.. ప్రస్తుతం రెమ్యునరేషన్ విషయంలో పట్టు విడుపులు ప్రదర్శిస్తుందట. దళపతి విజయ్ సినిమాకు కూడా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. ఇక ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకున్నా.. తమిళ్, హిందీలో మంచి అవకాశాలే వస్తున్నాయి. తెలుగులో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా సైన్ చేయలేదు. ఇక తమిళ్‌లో సూర్య 44 సినిమాలో కూడా ఈమె అవకాశాన్ని దక్కించుకుంది. ఈ రెండు సినిమాలు సక్సెస్ అందుకుంటే.. తనకు మరోసారి పూర్వ వైభవం వస్తుందని తెలుగులో కూడా అవకాశాలు వస్తాయని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ‌.