సినీ ఇండస్ట్రీలో దాదాపు 5 దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న రజనీకాంత్, కమలహాసన్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఇద్దరు.. టాలీవుడ్‌లోను సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి ఈ ఇద్దరు స్టార్ హీరోలను.. ఓ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట. ఇంత ఇమేజ్ దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు తెలుసుకోవాలని ఆసక్తి అందరిలో ఉంటుంది.
అయితే ఆమె మరి ఎవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ నదియా. 1985లో డైరెక్టర్ ఫాజిల్ తీసిన.. పోవే పూచూడవా సినిమాతో టాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చిన నదియా.. ఈ సినిమా కంటే ముందే మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 1980లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. మోహన్, సత్యరాజ్, ప్రభు, విజయకాంత్ ఇలా ఎంతోమంది హీరోలతో జతకట్టి మెప్పించింది. అయితే టాప్ హీరోలైన రజినీకాంత్, కమల్ హాసన్ లతో మాత్రం అమ్మడు సినిమాల్లో చేయలేదు. ముఖ్యంగా కమలహాసన్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా ఎన్నోసార్లు ఆ సినిమాలను రిజెక్ట్ చేసిందట నదియా.
ఈ క్రమంలో ఇప్పటివరకు కమలహాసన్‌తో ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం గమనార్హం. అయితే.. 1989లో డైరెక్టర్ ఆర్. సుందర్.. రాజాధిరాజా సినిమాలో నదియా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో రజినీ హీరోగా కనిపించారు. అయితే నదియా ఈ సినిమాలో నటించడానికి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయించుకుందట. రజనీకాంత్ కలర్ తక్కువ కనుక.. అతనితో నటించమని ససే మీరా సినిమా చేసే ఛాన్స్ లేదంటూ చెప్పేసిందట. కానీ చివరకు మేకర్స్ బలవంతంతో క్లోజ్ సీన్స్, డ్యూయెట్ పాటలో రొమాంటిక్ సీన్స్.. లాంటివి ఉండవని ఒప్పందం కుదుర్చుకొని సినిమాలో నటించిందని ఓ న్యూస్ గతంలో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంతో ఎవరికి తెలియదు.