టాలీవుడ్ మోస్ట్ పవర్ఫుల్ కపుల్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మహేష్, నమ్రత.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలిచినా ఈ జంట మధ్యన ఇటీవల దూరం పెరిగిందంటూ.. నెటింట ఓ వార్త వైరల్ గా మారింది. ఇంతకీ ఈ జంట మధ్యన దూరం పెరగడానికి కారణం ఏంటి.. అసలు అంతలా ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్లో ఓ పాన్ వరల్డ్ సినిమాకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన మహేష్ మేకోవర్ పూర్తిగా మార్చేశారు. గడ్డం, జుట్టు ఒత్తుగా పెంచి నయా లుక్‌తో కనిపిస్తున్నాడు. ఎప్పుడు క్లీన్ షేవ్‌తో.. ప్రేక్షకులకు కనిపించే మహేష్.. జుట్టు గడ్డం పెంచడంతో రాజమౌళి నుంచి రాబోతున్న సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన హైప్ పెరిగింది. ఇదంతా పక్కన పెడితే నమ్రత, మహేష్ బాబులకు ఈ సినిమా విషయంలోనే గ్యాప్ వచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
జక్కన్న సినిమాతో మహేష్ కు నమ్రతకు దూరం ఏంటి అనుకుంటున్నారా.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ఏ సినిమాకైనా హీరో కాస్ట్యూమ్ డిజైనర్‌గా.. రాజమౌళి భార్య రామా రాజమౌళి వ్యవహరిస్తుంది. ఇక మహేష్ సినిమాల్లో కాస్ట్యూం డిజైనర్ గా నమ్రత ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జక్కన్న సినిమా కోసం మహేష్ బాబు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా రమారాజమౌళి ఉంటుందట. దీంతో నమ్రత పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో మహేష్ ఫోటోషూట్ కి వెళ్ళినా.. నమ్రత ఆయనతో వెళ్లడానికి అసలు ఇష్టపడడం లేదని.. దీంతో మహేష్ ఒంటరిగా ఫోటోషూట్స్ కు వెళ్లి వస్తున్నట్లు తెలుస్తోంది. అలా జక్కన్న సినిమా కారణంగా మహేష్ నమ్రతల మధ్యన దూరం పెరుగుతుందంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్.