సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం లవ్ ఎఫైర్స్, బ్రేకప్ చాలా కామన్ గా మారిపోయాయి. వివాహం చేసుకొని ఎంతో కాలం అన్యోన్యంగా ఉన్న జంట.. సడన్గా డివోర్స్ తీసుకుని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ధనుష్ – ఐశ్వర్య కూడా ఆ లిస్టులో ఉన్న వారే. అయితే మొదటి నుంచి స్టార్ సెలబ్రిటీగా ఉన్నవారు.. వివాదాలు ఏర్పడిన తర్వాత సోషల్ మీడియా వేదికపై ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకోవడం.. పబ్లిక్ అపీరియన్స్‌ను తగ్గించడం.. ఎవరికి వారు ఒంటరిగా బయట కనిపించడం.. లాంటి హింట్స్ ఇస్తూ అభిమానులకు సందేహం కలిగిస్తున్నారు.
చివరకు వారి సందేహాలను నిజం చేస్తున్నారు. అలా తాజాగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరు కూడా పబ్లిక్ గా ఎక్కడ కలసి కనిపించడం లేదు. అభిషేక్ ఫ్యామిలీ ఫొటోస్ లో ఐశ్వర్య, తన కూతురు ఉండడం లేదు. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యరాయ్ కి మధ్యన వివాదాలు నెలకొన్నాయంటూ వార్తలు తెగ వైరల్ గా మారాయి. దీనికి తగ్గట్టుగానే ఇటీవల వచ్చిన రెడిట్ పోస్ట్ ఆరోపణలకు మరింత ఆద్యం పోసింది.
అభిషేక్ బచ్చన్ కు వేరే హీరోయిన్‌తో ఎఫైర్ ఉందని.. ఈ కారణంగానే ఐశ్వర్య అభిషేక్ తో గొడవ పెట్టుకుందని.. ఆ వివాదం కాస్త పెరగడంతో వీరిద్దరూ విడిపోయారంటూ తెలుస్తోంది. ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయిందట. అభిషేక్ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ కూతురిని చూసుకుంటుందట. కానీ.. వీరిద్దరు లీగల్‌గా డివోర్స్ తీసుకోవాలనుకోవడం లేదని సమాచారం. అయితే ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.. అనుకుంటున్నారా.. దస్వి సినిమా షూట్ టైం లో అభిషేక్‌తో కలిసి నటించిన నిమ్రత కౌర్ అట. నిమ్రతతో అభిషేక్ ఎఫైర్ గురించి తెలిసిన ఐశ్వర్య.. గొడవ పెట్టుకోవడంతో వీరు వైవాహిక బంధం లో సమస్యలు తలెత్తాయని.. ఇటీవల వచ్చిన రెడిట్ పోస్టులో వెల్లడించారు.