ఇటీవల టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బయ్యర్లు ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో తో వచ్చిన టాక్ సినిమా బయిర్‌లలో ఒకరైన సితార నాగవంశీని కాస్త కలవర పెట్టినా.. మెల్లమెల్లగా సినిమా పికప్ అవుతూ వచ్చింది. పాజిటివ్ టాక్ రావడం.. దీనికి తగ్గట్టుగానే వరుస సెలవులు, మరే పెద్ద సినిమా లేకపోవడంతో దేవర సినిమాకు మరింత ప్లస్ అయింది.
ఈ క్రమంలో ఆడియన్స్ కూడా సినిమాకు క్యూ కట్టారు. దీంతో ఈస్ట్ మినహా మిగిలిన అన్ని చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్‌కు దేవర దగ్గర అయింది. దసరా సీజన్లో జిఎస్టిలు లేకపోవడంతో.. మరిన్ని లాభాలు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. ఇక నైజం, వైజాగ్ ఓవర్ క్లోస్ ఏమన్నా ఉంటే.. ఆ లాభాలు అన్ని నాగవంశీకి దక్కుతాయి. అందుకే సితార, హారిక అండ్ హాసిన్ బ్యానర్ల బయ్యర్లు.. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
ఈ క్రమంలోనే అందరినీ దుబాయ్ తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈనెల 16 నుంచి 19 వరకు దుబాయిలో ఎంజాయ్ చేసి వస్తారట. అంటే రెండు మూడు రోజులు ట్రిప్. ఈ ట్రిప్‌కు బయ్యర్లతో పాటు.. నాగ వంశీ, అతని సన్నిహితులు కూడా వెళ్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ పార్టీలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. తారక్.. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ తో సినిమాను ఫిక్స్ చేసినట్లు సమాచారం.