కొడుకు నిలదీయడంతో ఆ అలవాటు వదులుకున్న ఎన్టీఆర్.. బాలయ్య దాన్ని కొనసాగిస్తున్నాడే..?

తెలుగు సినిమా దిగ్గ‌జ‌ నటుడు నందమూరి తారకరామారావు తెలుగు సినిమాలలో తన నటనతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్నాడు. నటుడిగా తనను ఆదరించిన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి సామాజిక సేవతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇప్పటికి ఎన్టీఆర్‌ను దైవంగా చాలామంది భావిస్తారు. ఇక సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనూ ఎంతో క్రమశిక్షణతో ఉండే ఎన్టీఆర్.. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి.. కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఎంతటి వారికైనా ఏదో ఒక బలహీనత ఉంటుందన్నట్లు.. ఎన్టీఆర్‌కు కూడా ఓ వ్యాసనం ఉండేదట‌. ఆ వ్యసనం గురించి చిన్న కొడుకు ఎన్టీఆర్ ను నిలదీయడంతో.. దాన్ని వదులుకున్నాడట. ఎన్టీఆర్ కు 12 మంది సంతానం.. 8 మంది అబ్బాయిలు, 4 అమ్మాయిలు.. వారిలో బాలకృష్ణ, హరికృష్ణ, కూతుళ్ళు.. పురందేశ్వరి, భువనేశ్వరి మాత్ర‌మే తెలుగు ప్రేక్షకుల్లో పాపుల‌ర్‌.

File:NTR as Girisam in Kanyasulkam.png - Wikimedia Commons

ఇక ఎన్టీఆర్ కొడుకుల్లో ఒకరైన జయశంకర్ కృష్ణ.. ఎన్టీఆర్‌కున్న ఓ వ్యాసనం విషయంలో ఆయన్ను విభేదించాడట. నేరుగా వెళ్లి ప్రశ్నించాడట. ఎన్టీఆర్ కి పొద్దు పొద్దున్నే చుట్టు తాగే అలవాటు ఉంది. ఆయన దినచర్యలో భాగం. ఎన్టీఆర్ చుట్ట‌ తాగుతున్న సంగతి కుటుంబ సభ్యులకు తెలిసిన ఎవరు ఆయనను అడిగేవారు కాదట. హరికృష్ణకు కూడా స్మోకింగ్ అలవాటు ఉంది. ఆయన సిగరెట్స్ ఎక్కువగా తాగే వార‌ట‌.. ఎన్టీఆర్‌కి అది అసలు నచ్చది కాదట. సిగరెట్ అలవాటు వదులుకోవాలని హరికృష్ణకు.. ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేవాడు. కాగా జయశంకర్ కృష్ణకు అది నచ్చలేదు. తండ్రి ఎన్టీఆర్ చుట్ట తాగుతూ.. అన్నయ్యని సిగరెట్ మానేయమని నీతులు చెబుతున్నారే అంటూ మనసులో మాట నేరుగా ప్రశ్నించాడట. నాన్న మీరు చుట్టా తాగుతూ.. అన్నాను సిగరెట్ మానేయ మండలం సరికాదు అన్నాడ‌ట.

Nandamuri Balakrishna | #GodofMassesNBK Movies today on Small Screen🔥💥  #Bhairavadweepam 10AM on @ETVCinema 🔥 #VeeraSimhaReddy 🔥🦁 12PM on  @StarMaaMovies… | Instagram

జయశంకర్ కృష్ణ ఎన్టీఆర్ ను షాకైన ఎన్టీఆర్‌.. నిజమే కదా అని భావించి తర్వాత మళ్లీ ఎప్పుడు చుట్టూ జోలికి పోలేదట. నిజానికి చుట్టు తాగడం ఎన్టీఆర్ కు మొదటి నుంచి ఉన్న వ్యసనం కాదు. నటులకు గొంతు చాలా అవసరం. వాయిస్ మాడ్యులేషన్ కోసం ఆయన రోజు ఉదయాన్నే చుట్టూ తాగడం అలవాటు చేసుకున్నారట. ఏదేమైనా కొడుకు అలా నిలదీయడంతో ఎన్టీఆర్ ఇకపై చుట్టా తాగకూడదని ఫిక్స్ అయ్యాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కూతురు పురుందేశ్వరి స్వయంగా వివరించారు. ఇక ఆ అలవాటు బాలకృష్ణ కంటిన్యూ చేస్తున్నారు. బాలకృష్ణ ఉదయం లేచిన వెంటనే ప్రతిరోజు ఓ చుట్టా తాగుతారట. చుట్ట తాగడం వల్ల గొంతులో స్లేషం అంత బయటకు పోయి గొంతు ఫ్రీ అవుతుంది.. సినిమాలో డైలాగ్స్ చెప్పడానికి అది సహకరిస్తుందని బాలకృష్ణ గట్టిగా నమ్ముతారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ సంద‌ర్భంలో వెల్లడించారు.