ఇండియన్ బిజినెస్ జియాంట్.. జీరో హైటెర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ దక్కించుకున్న టాటా గ్రూప్ చైర్మన్.. టాటా సన్స్ మాజీ చైర్మన్.. రతన్ టాటా(85) ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. వృద్ధాప్యసమస్యలతో బాధపడుతున్న ఈయన గత రెండు రోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇక రక్తపోటు సమస్య కారణంగా ముంబైలోని బ్రీచ్ హ్యాండీ హాస్పిటల్ లో చేరిన రతన్ గారు నిన్న (అక్టోబర్ 9న) రాత్రి చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచాడు. ఈ వార్త భారతదేశాన్ని శోక సంద్రంలో ముంచేసింది. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు పంచిన రతన్ టాటా.. ఎన్నో ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్నాడు. అలాగే సినిమా ఇండస్ట్రీలోనూ ఆయన ఓ సినిమా తీశాడన్న సంగతి చాలా మందికి తెలియదు.
ఉన్నత విలువలతో వ్యాపారాలు చేస్తూ మహోన్నత శక్తిగా మారిన రతన్ టాటా.. పేదల బంధువుగా, బిజినెస్ మెన్ గానే కాదు.. సామాజిక సేవలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాని స్థాపించినా ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన రతన్ టాటా.. చేయని బిజినెస్ అంటూ లేదు. ఎయిర్ క్రాఫ్ట్, పరిశ్రమ, ఆటోమోటివ్ , పవర్, స్టీల్, హోటల్, ఐటి, రియల్ ఎస్టేట్ ఇలా ఎన్నో రంగాల్లో రాణించాడు. ఈ క్రమంలో ఓ సినిమాలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ.. అన్ని రంగాల్లో సక్సెస్ అయినట్లు ఆయనకు సినిమా రంగం సక్సెస్ అందించలేదు. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోర డిజాస్టర్‌గా నిలిచింది. అప్పటినుంచి రతన్ టాటా మరే సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించలేదు. ఇండస్ట్రీ వైపు చూడనైనా లేదు. ఇంతకీ రతన్ డేటా నటించిన ఆ ఏకైక మూవీ ఏంటో చెప్పలేదు కదా.
అదే ” ఎత్‌బార్ ” మూవీ. బాలీవుడ్ నిర్మాత జితిన్ కుమార్ తో కలిసి రతన్ టాటా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబచ్చన్, జాన్ అబ్రహం, బిపాస బస్సు ప్రధాన పాత్రల్లో కనిపించారు. 1996లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ ఫియర్ స్పూపూర్తితో విక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో 2004లో రిలీజ్ అయింది. రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఢీలా పడింది. రూ.10 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో.. కనీసం పెట్టిన బడ్జెట్లో సగం కూడా తిరిగి రాలేదు. అలా రతన్ టాటా ప్రొడ్యూస్ చేసిన సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో.. రతన్ టాటా మరో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఇండస్ట్రీ వైపు అడుగు కూడా పెట్టలేదు. ఈ సినిమా తెచ్చిన నష్టాలకు మరోసారి ఇండస్ట్రీ వైపు చూడకూడదని రతన్ టాటా నిర్ణయించుకున్నారట. ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే ఇండస్ట్రీలోనూ ఆయన రాణించేవారు.