బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్ దేవర..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో దేవ‌రా తెర‌కెక్కింది. జాన్వి కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విల‌న్ పాత్రలో మెప్పించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన‌ ఫస్ట్ డే ప్రిమీయ‌ర్‌ షోతో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు ప్రేక్షకులు సినిమాకు క్యూ క‌ట్టారు. ఈ క్రమంలో సినిమా ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది.

Baahubali 2 Box Office Collection | All Language | Worldwide - Sacnilk

ఇక తాజాగా తారక్.. దేవర, బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు కలెక్షన్ల షేర్‌లో బాహుబలి 2 రూ.3.50 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి మొదటి స్థానంలో నిలిచింది. కానీ.. తాజాగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవర 16వ‌ రోజున కలెక్షన్స్ తో ఆ రికార్డును బ్రేక్ చేసి మొద‌టి స్థానం ద‌క్కించుకుంది. ఏకంగా రూ.3.65 కోట్ల వసూళ్ళ‌ను దక్కించుకొని రికార్డ్ సృష్టించింది. ఇక ఈ జాబితాలో దేవర, బాహుబలి 2 తర్వాత మూడో స్థానంలో హనుమాన్ ఉంది. రూ.3.21 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఆర్‌ఆర్ఆర్ రూ.3.10 కోట్లు, ఎఫ్2 రూ.2.56 కోట్లు కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించింది.

Devara Part 1 (2024) - IMDb

గత నెల 27న రిలీజ్ అయిన దేవర తాజాగా రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా లెవెల్లో తారక్ నుంచి వచ్చిన మొదటి సోలో సినిమాతోనే ఈ రేంజ్‌లో కలెక్షన్లు రావడం అంటే సాధారణ విషయం కాదు. దీన్నిబట్టి పాన్ ఇండియా లెవెల్లో తారక్‌కు ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికీ చాలాచోట్ల థియేటర్లలో ఫుల్ ఆక్యుఫెన్సీ తో దూసుకుపోతున్న దేవర.. ఫ్యూచర్లో మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.