ఏంటి బాలీవుడ్ యాక్టర్స్ సైఫ్ అలి ఖాన్, వైయస్ షర్మిలకు లింక్ ఉందా.. ఇది ఎక్కడ గోల రా బాబు.. వాళ్ళిద్దరికీ అసలు లింక్ ఏంటి అనుకుంటున్నారా.. మీరువిన్నది నిజమే కానీ.. మీరు అనుకుంటున్న రిలేషన్ కాదు లెండి. వారిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ పేరుకు సంబంధించింది. చాలా గమత్తుగా ఉంటుంది. అదెలా అనుకుంటున్నారా.. బాలీవుడ్ నటులలో ఒకడిగా సైఫ్‌అలీఖాన్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారో తెలిసిందే. ఒకప్పుడు హీరోగా వరుస విజయాలను అందుకున్న సైఫ్.. మధ్యలో హీరోగా అవకాశాలు తగ్గడంతో విలన్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తన నటనలో వైవిధ్యత చూపిస్తున్నాడు.
ఇదే క్రమంలో తానాజీ మూవీ లో సైఫ్ విల్లనిజంకు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. ప్రభాస్ అధిపురుష్ మూవీలో రావణాసుర, ఎన్టీఆర్ దేవరల్లో బైరాగా తన విలనిజంతో టాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. ఇక సైఫ్ తల్లి కూడా ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ షర్మిల ఠాగూర్. అప్పట్లో షర్మిల ఠాగూర్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు ప్రేక్షకులు పిచ్చెక్కిపోయే వాళ్ళు. ఓ స్టార్ హీరో కు ఉన్న క్రేజ్ అప్పట్లో సైఫ్ తల్లికి ఉండేది. అప్పటి స్టార్ సెలబ్రిటీల్లో కూడా షర్మిల ఠాగూర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదట. అలాంటి షర్మిల ఠాకూర్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో ప్రత్యేక అభిమానం.
ఎంతలా అంటే ఆమెపై ఉన్న అభిమానంతోనే తన కూతురికి కూడా షర్మిల పేరును పెట్టుకున్నారు. అలా వైయస్ కూతురుకు షర్మిల రెడ్డి పేరు పెట్టారట. ఇదే విషయాన్ని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఇక సైఫ్‌అలీఖాన్ తల్లిదండ్రులు ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆయన తండ్రి ఒకప్పటి ఇండియన్ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్. అంతేకాదు వీళ్ళు రాజు వంశీయుల ఫ్యామిలీ కుటుంబానికి చెందిన వాళ్ళే. అయితే ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ తల్లి పేరు.. షర్మిలకు వైయస్ రాజశేఖర్ రెడ్డి పెట్టారని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరి మధ్యన లింకు భలే కలిసిందే అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.