ఇలా అయితే మా ఆఖీరాకు ఏం మిగలదంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్..!

ఇండస్ట్రీలో స్టార్ కిడ్‌గా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం చాలా సులభమని అంతా భావిస్తూ ఉంటారు. కానీ స్టార్ హీరోలుగా ఉన్న‌ తండ్రి లెగ‌సీని కంటిన్యూ చేస్తూ.. అభిమానుల అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి వార‌సులుగా అడుగుపెట్టిన వాళ్ళు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కఠిన శ్రమ అవసరం. అలా ఇప్పటికే బాలకృష్ణ, నాగార్జున, చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎంతోమంది అడుగుపెట్టి సక్సెస్ సాధించారు. అయితే ప్రస్తుతం మెగా అభిమానులంతా పవన్ కళ్యాణ్ వారసుడుగా అఖిరానందన్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. రేణు దేశాయ్ కూడా అఖీరా ఆలోచనలకు అడ్డ చెప్పే వ్యక్తి కాకపోవడంతో మరో మూడేళ్లలో జూనియర్ పవర్ స్టార్ తెరపై మెరుస్తాడని ఆశిస్తున్నారు.

Anchor Pradeeps next titled Akkada Ammayi Ikkada Abbayi

ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ న‌టించిన అతి త‌క్కువ సినిమాల్లో బ్లాక్ బాస్టర్ సినిమాల టైటిల్స్ ను ఒక్కొకరిగా ఇతరులు వాడేసుకుంటున్నారు. ఈ విషయంపై పవన్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. వరుణ్ తేజ్ – తొలిప్రేమ, విజయ్ దేవరకొండ – ఖుషి, నితిన్ – తమ్ముడు, తాజాగా యాంకర్ ప్రదీప్ – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. సినిమా టైటిల్స్ తీసేసుకున్నారు. ఇక పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్లలో మిగిలింది సుస్వాగతం, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది. వీటిలో సుస్వాగతం, జల్సా కూడా రిజిస్టర్ చేసి పెట్టుకున్నారని సమాచారం. ఇలా అయితే ఆకీరా ఎంట్రీకి ఇంకేం మిగలవ్ అంటూ అభిమానులు మండిపడుతున్నారు.

Akira Nandan : పవన్ కొడుకు అకిరా నందన్ యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్  అకౌంట్స్ ఇవే.. అకిరా ఎడిటింగ్స్ అదిరిపోయాయిగా.. | Pawan kalyan son akira  nandan editing social ...

మెగాస్టార్ విషయంలోను చరణ్ ఎంట్రీ అప్పుడు ఇదే సమస్య వాటిల్లింది. దాదాపు అన్ని బ్లాక్ బాస్టర్ సినిమాల టైటిల్స్ ఇద్దరు సెలబ్రిటీస్ వాడేసుకోవడంతో.. అప్పట్లోనే మెగా కాంపౌండ్ లో చర్చ జరిగింది. అన్ని సినిమాలు ఇతర సెలబ్రెటీస్ టైటిల్స్ వాడేసుకుంటే.. చరణ్ కు ఏమి మిగలవ్ అంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా.. కథకు తగ్గట్టుగా టైటిల్ పెట్టాలి. కానీ.. అనవసరంగా ముందే టైటిల్ రిజిస్ట్రేషన్ కు డబ్బులు వేస్ట్ చేయ‌లేము కదా అనేది మెగా ఫ్యామిలీ వెర్షన్ అట‌. ఇక ఓ సినిమాలో పాటలు మరో సినిమాలో వాడుకోకుండా ఆపొచ్చు కానీ.. టైటిల్స్ పెట్ట‌కుంండా ఎవ్వరూ ఆపలేరు.