స్టార్ బ్యూటీ సమంత ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా.. బాలీవుడ్ లో పళ్ళు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే సమంత నుంచి తాజాగా సిటాడెల్.. హనీ బన్నీ.. ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడి యాక్షన్ సన్నివేశాలో స్టార్ హీరోలను డామినేట్ చేసే విధంగా అదరగొట్టింది. ఈ సిరీస్‌లో స్పై ఏజెంట్‌గా సమంత కనిపించనుంది. కాగా స్పై ఏజెంట్‌గా మారకముందు నటి కావాలని సమంత ప్రయత్నాలు చేసినట్లు ట్రైలర్లో చూపించారు.
ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ.. తన ఫస్ట్ ఆడిషన్స్ గురించి గుర్తుచేసుకుంది. తన మొదటి సినిమా ఏ మాయ చేసావే సమయంలో జరిగిన ఆడిషన్స్ హనీ బన్నీ.. సినిమాల్లో నాకు జరిగిన ఆడిషన్స్‌కు మధ్య డిఫరెన్స్ ఉందంటూ వెల్లడించింది. ఈ వెబ్ సిరీస్‌లో నేను చెత్తనటిగా.. అంటే అసలు నటన రాని అమ్మాయిగా కనిపించాలి. నేను ఆ ఆడిషన్ సీన్స్ బాగా చేశా.. ఆ సీన్ ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నా.. ఎందుకంటే నేను సగభాగం ఇప్పటికీ చెత్తనటిని అంటూ నవ్వుతూ కామెంట్ చేసింది.
ఇప్పటికి నేను అలానే ఉన్నానని.. నేను ఏదైనా సినిమాలో బాగా నటించానంటే అది కేవలం నాకు మాత్రమే సొంతం కాదు. ఒక మంచి టీం దొరికినప్పుడే ఎలాంటి సెలబ్రిటీలలో అయినా ఉత్తమ నటన బయటకు వస్తుంది అంటూ సమంత వెల్లడించింది. ఇక సమంత నటించిన సిటాడల్ హనీ బన్నీ సిరీస్ ఈ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సిరీస్ లో క్లైమాక్స్.. సిరీస్‌కి హైలెట్ అంటూ వెల్లడించింది. 11 నిమిషాల ఇంటెన్స్ యాక్షన్స్ సీన్ సింగల్ టేక్ లో ఎలాంటి కట్స్ లేకుండా షూట్ చేశారంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సమంత చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.