ప్రభాస్ ఫ్యాన్స్ కు డబ్బులు ట్రీట్.. ‘ స్పిరిట్ ‘లో రెబల్ స్టార్ డ్యూయల్ రోల్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రభాస్ వరుస సినిమాల లైనప్‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డివంగ డైరెక్షన్లు తెర‌కెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Spirit Movie Updates,Prabhas స్పిరిట్ మూవీపై క్రేజీ అప్‌డేట్ చెప్పిన  ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్‌ - crazy update on prabhas spirit movie shooting -  Samayam Telugu

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను డిసెంబర్లో సెట్స్ పైకి తీసుకురానున్నారు మేక‌ర్స్‌. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ప్ర‌భాస్‌ సినీ కెరీర్‌లోనే మొదటిసారి ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఈ సినిమాల్లో ఎన్నో సర్ప్రైసింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని ఆడియన్స్ ఫుల్ ఖుషి అవుతారని సమాచారం. అయితే తాజాగా అందుతున్న వార్తల ప్రకారం రెబల్ స్టార్ స్పిరిట్‌లో డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారట.

SPIRIT: Prabhas to get a beautiful shock | cinejosh.com

ప్రభాస్ పాన్ ఇండియ‌న్ స్టార్‌గా ఎదగడానికి కారణమైన మొట్టమొదటి మూవీ బాహుబలి లో కూడా డ్యూయెల్ రోల్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పాత్రలు ఒకేసారి తెర పై మాత్రం కనిపించలేదు. కానీ ప్రభాస్ నటించనున్న‌ నెక్స్ట్ మూవీ స్పిరిట్‌లో మాత్రం ఒకేసారి రెండు పాత్రల‌లో కనిపించనున్నాడ‌ట. మరో విశేషం ఏమిటంటే సినిమాలో రణ్‌బీర్‌ కపూర్, విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ లో కనిపిస్తారట‌. వీరితోపాటే మరో ఇద్దరు ముగ్గురు బడా స్టార్స్ కనిపించనున్నారని టాక్. వీటిల్లో నిజం ఎంతో తెలియాలి అంటే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వేచి చూడాల్సిందే.