టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ఈ పేరే ఓ సంచలనం. టాలీవుడ్ ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్లో విస్తరించిన రాజమౌళి.. స్టార్ హీరో రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ లెవెల్లో సక్సెస్ సాధించడమే కాదు.. హాలీవుడ్ రేంజ్లో క్రేజ్ దక్కించుకున్నాడు. ఎంతో మంది దిగ్గజ దర్శకుల ప్రశంసలు అందుకుని అన్ని విధాల గౌరవం దక్కించుకున్నాడు. ఇక కేవలం దర్శకుడు గానే కాదు.. రాజమౌళి పలు సినిమాల్లో నటుడుగాను మెరిసిన సందర్భాలు ఉన్నాయి.
అలా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898ఏడీ మూవీ ఒకటి. ఈ సినిమాలో రాజమౌళి క్యామియో రోల్లో కనిపించి మెప్పించారు. నాగ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాల్లో రాజమౌళి గెటప్ రిలీజ్ వరకు హైడ్ చేసతూ వచ్చారు మేకర్స్. ఇక ఈ సినిమా టైంలో రాజమౌళి స్టిల్స్ నెటింట తెగ వైరల్గా మారుతున్నాయి. ఇవి జక్కన్న ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోస్లో బ్రౌన్ టీషర్ట్.. స్టైలిష్ జాకెట్ ధరించి సీరియస్ లుక్ తో మెప్పించాడు జక్కన. పూర్తిగా మాస్ అవతారంలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక కల్కి పార్ట్ 2లో కూడా రాజమౌళి కనిపిస్తే బాగుంటుందని.. ఇలాంటి లుక్ తోనే ఆకట్టుకోవాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వం కాదు నటనను కూడా ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక జక్కన్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాను తెరకెక్కించి తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి సినిమా పనులు ప్రారంభించనున్నారని సమాచారం. ఇక రాజమౌళి డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా కావడంతో.. సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ సినిమా సెట్స్ పైకి వచ్చి రిలీజ్ ఆపడానికి మరో మూడేళ్లు సమయం పడుతుందని.. 2027 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల అంచనా.