ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప టాలీవుడ్ ట్రెడిషనల్ బ్యూటీ.. 40ల్లోను చెక్కుచెదరని అందం.. గుర్తుపట్టారా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకోవాలంటే కచ్చితంగా స్కిన్ షో చేయాల్సిందే. గ్లామర్ ట్రీట్‌లో కుర్ర‌కారును ఆకట్టుకోవాల్సిందే అన్న టాక్‌ బయట వినిపిస్తూనే ఉంటుంది. దాదాపు అందరూ స్టార్ హీరోయిన్స్ కూడా ఇలా గ్లామర్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వారే. అయితే ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ ట్రీట్‌కు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ లుక్ తోనే ప్రేక్షకులను మెప్పించిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో సావిత్రి, సౌందర్యలతోపాటు ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడి పేరు కూడా వినిపిస్తుంది.

Actress Sneha Turns 42: How The Smiling Queen Made Her Way To The Hearts Of  Tamil Audience - News18

ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. తను మరెవరో కాదు స్టార్ట్ బ్యూటీ స్నేహ. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలో నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా దూసుకుపోయింది. స్కిన్ షోకి, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ హోమ్లీ పాత్రల్లో ఆకట్టుకుంది. జూనియర్ సౌందర్య గా అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అయితే పెళ్లయిన తర్వాత కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అమ్మడు తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ మెప్పించింది.

Sneha: Saree, Not Sorry

ఇప్పటికే అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే స్నేహ పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు.. అభిమానులు ఆమెకు బర్త్డే విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే అమ్మ‌డి చిన్ననాటి ఫోటో ఒకటి నెటింట‌ తెగ చెక్కర్లు కొడుతుంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడికి టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. కోలీవుడ్‌లో మాత్రం భారీ సినిమాల్లో అవకాశాలను ద‌క్కించుకుంటూ రాణిస్తుంది. ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ తన పాత్రకు న్యాయం చేస్తున్న స్నేహ‌.. ఈ ఏడాది మొదట్లో వచ్చిన విజయ దళపతి గోట్‌ మూవీలో విజయ్‌కు భార్యగా నటించి మెప్పించింది.