ఆ స్టార్ యాక్టర్ అర్ధరాత్రి నా గది దగ్గరికి వచ్చి తలుపులు కొట్టాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మల్లికా శరావత్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలా కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. ఇంత‌ కాలం గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకు.. విక్కీ విద్యా కా వో వాలా వీడియోతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మొదట్లో తను ఎదుర్కొన్న చేదు అవమానాలను అభిమానులతో షేర్ చేసుకుంది. సినీ రంగంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి బయట పెట్టింది.

షూటింగ్ కోసం మల్లికా దేశ, విదేశాలకు వెళ్లానని.. అయితే ఓ షూటింగ్ కోసం మూవీ టీం కలిసి దుబాయ్ వెళ్ళాక‌.. భారీ బడ్జెట్ మూవీ కావడంతో కొద్ది రోజులు అక్కడే ఉండాల్సి వచ్చిందని.. ఆ సమయంలో ఓ స్టార్‌ హీరో.. తనను వేధించాడు అంటూ వెల్లడించింది. దుబాయ్ లో పెద్ద మూవీ షూటింగ్లో పాల్గొన్నానని.. ఆ మూవీలో చాలామంది స్టార్స్ ఉన్నారు. ఈ సినిమా జనాలకు కూడా విపరీతంగా నచ్చింది. అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. అందులో నేను కామెడీ రోల్ ప్లే చేశా. అక్క‌డివరకు అంతా బాగున్నా. ఆ హీరో అర్ధరాత్రి వచ్చి నా గ‌ది తలుపులు కొట్టేవాడు. అతడు తలుపు బద్దలు కొడతాడేమోనని భయపడిపోయా.

గట్టిగా తలుపులు కొడుతుంటే.. గది తలుపులు ఓపెన్ కాకూడదని కోరుకునేదాన్ని. ఆ ఘటన తర్వాత మళ్లీ ఎప్పుడు ఆ హీరోతో కలిసి పనిచేయలేదు అంటూ మల్లిక‌ చెప్పుకొచ్చింది. అయితే ఇండస్ట్రీలో తనకు ఇలాంటి చేదు అనుభవాలు కొత్తమీ కాదు. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి అంటూ చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ.. హీరో పేరు బయట పెట్టడానికి ఇష్టపడలేదు. విక్కీ విద్యాకో వో వాలా వీడియో అక్టోబర్ 11న ఆడియన్స్ ముందుకు రానుంది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ హిందీలో మల్లికా కనిపించనుంది. ఇందులో త్రిప్తి, రాజకుమార్ రావు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.