టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్యకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా.. కేవలం డైలాగ్ డెలివరీ వల్లే.. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయనడంలో సందేహంలేదు. డైలాగ్ డెలివరీ లో బాక్సాఫీస్ కింగ్ బాలయ్యే అంటూ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎన్నో కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉండడం విశేషం. ఈ విషయంలో బాలయ్యకు మరే స్టార్ హీరో కూడా సాటిరారంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కత్తులతో కాదురా కంటి చూసుతో చంపేస్తే.. అంటూ ఆయన సినిమాల్లో రాసిన పాతికేళ్ల క్రితం డైలాగులైన ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చేస్తాయి. అంటే ఏ రేంజ్ లో ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆడియన్స్ ఆయన డైలాగ్స్ ఏ రకంగా ఇష్టపడతారో తెలుస్తుంది. ఇక బాలయ్య చివరిగా నటించిన భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ్లో రీమేక్ అవుతుందని టాక్ కూడా నడుస్తుంది. బాలయ్య బాబు మూవీకి సైతం వీరమాస్ అనే టైటిల్ను పెట్టాలని భావిస్తున్నారట. అతి త్వరలో బాలయ్య బాబు మూవీకి సంబంధించిన టీజర్, అలాగే టైటిల్ కూడా మేకర్స్ అఫీషియల్ గా రివీల్ చేయనున్నారని టాక్ నడుస్తుంది.
బాలయ్య ఏ సినిమాలో నటించిన దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను వీక్షిస్తారు. అలాగే ప్రేక్షకులు బాలయ్య సినిమాలకు బ్రహ్మరథం పడతారు. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మిల్స్ లాంటి సినిమాలలో బాలయ్య నటిస్తూ ఉండడం విశేషం. ఇక రెమ్యూనరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్న బాలయ్య.. ఒక్కో సినిమాకు రూ.34 నుంచి 35 కోట్ల వరకు చార్జ్ చేస్తారు. టాలీవుడ్ ప్రముఖ బ్యానర్లు బాలయ్యతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతాయి. ఇక ప్రస్తుతం డైరెక్టర్ల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న బాలయ్య.. ఫ్యూచర్లో పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసి.. హిందీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటారేమో వేచి చూడాలి.