‘ గేమ్ ఛేంజ‌ర్‌ ‘ను బీట్ చేసిన బాల‌య్య 109… న‌ట‌సింహాన్ని అక్క‌డ కొట్టేవాడే లేడు..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ ఎంత స్పెషల్. సంక్రాంతిలో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు హీరోల దగ్గర నుంచి మేకర్స్ వరకు ప్రతి ఒక్కరు తాప‌త్ర‌య‌పడుతూ ఉంటారు. వరుస సెలవులు ఉండటంతో ఆడియన్స్ సినిమాలను ఆదరిస్తారు.. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అలా ఈ సారి సంక్రాంతి పోటీలో కూడా పెద్ద సినిమాలు నిలవనున్నాయి. వాటిలో బాలకృష్ణ నుంచి రెనున్న‌ ఎన్పీకే 109, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజ‌ర్‌ ఇప్పటికే ఫిక్స్ అయిపోయాయి. మరికొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయ‌ని టాక్.

Balakrishna NBK 109 Title Teaser To Release On Diwali | cinejosh.com

ఇక ఎప్పటికప్పుడు సంక్రాంతి బరిలో మెగ, నందమూరి సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. రెండు సినిమాల్లో పై చేయి ఎవరిది అవుతుందా తెలుసుకోవాలని ఆసక్తి అభిమానులను నెలకొంటుంది. అయితే ఎప్పుడు చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ ఉండేది. అయితే ఈసారి పోటీ చరణ్.. గేమ్ ఛేంజ‌ర్‌, బాలయ్య 109 సినిమాల మధ్యన జరగనుంది. ఈ క్రమంలోనే ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు రాబట్టి.. పైచెయ్యి సాధిస్తుందో అనే చర్చ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇలాంటి క్రమంలో ఏరియా బిజినెస్ పరంగా చరణ్.. గేమ్ ఛేంజ‌ర్‌ కంటే.. బాలయ్య 109 సినిమానే టాప్ అనే న్యూస్ ట్రేడ్ వర్గాల్లో నడుస్తుంది.

Game Changer (2025) - IMDb

తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ చాలా ప్రత్యేకం. ఇక్కడ తెలుగు హీరోల అందరిలో.. కొంతమందికి మాత్రమే చాలా క్రేజ్ ఉంటుంది. అలాంటివారిని నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన నటించిన సినిమాలు అక్కడ విపరీతంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే ఎన్బికె 109 సినిమాకు ఏకంగా రూ.19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఇది బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ బిజినెస్ అని టాక్. చెర‌ణ్‌కు కూడా అక్క‌డ మంచి మార్కెటే ఉంది. కానీ గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాకు అక్కడ రూ.15 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే చరణ్ మీద బాలయ్యే పై చేయి సాధించేలా ఉన్నాడంటూ నందమూరి ఫ్యాన్స్ ఈ లెక్కలను హైలెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.