రోజుకి 9 షోలు.. టాలీవుడ్ లోనే బ్లాక్ బస్టర్ రికార్డ్ క్రియేట్ చేసిన చిరు మూవీ ఏంటంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు, కటోర శ్రమ తర్వాత స్టార్ హీరోగా మారడు. తన కుటుంబం నుంచి ఎంతోమంది యంగ్ హీరోలను పరిచయం చేస్తూ మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దాదాపు తన 40 ఏళ్ల సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో ఎన్నో వైవిద్య పాత్రల్లో నటించి ఆకట్టుకున్న చిరంజీవి.. తన నటన, డ్యాన్స్, టాలెంట్ తోనే కాదు.. సాంఘిక సేవలతో సింప్లిసిటీతోను లక్షలాది మంది అభిమానానికి సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విశ్వంభర సెట్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న చిరు.. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే మెగాస్టార్ సినీ కెరీర్‌లో మాస్ ఇమేజ్ ని తెచ్చి పెట్టిన సినిమాల్లో ముఠామేస్త్రి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Watch Mutha Mestri (Telugu) Full Movie Online | Sun NXT

ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది అనడంలో అతిశయోక్తి లేదు. కోదండరామిరెడ్డి చిరు కాంబినేషన్‌లో ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు సినిమాల తర్వాత ముఠామేస్త్రి సినిమా తెర‌కెక్కింది. రోజా, మీనా హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఎంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో రూపొందించారు. ఖర్చు ఎక్కువ అవుతుంది అని మరో నిర్మాతను కూడా కోదండరామిరెడ్డి లైన్లో పెట్టారు. అలా ముఠామేస్త్రి సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా షూట్ టైంలో చిరు రాజకీయాల్లో వస్తున్నారని అందుకే ఇలాంటి సినిమాలు నటిస్తున్నారంటే రూమర్లు కూడా వినిపించాయి. ఇక సినిమా చాలా కాలం వరకు సెన్సార్ పనుల కారణంగా రిలీజ్ కు వాయిదా కూడా పడుతూ వచ్చింది.

Muta Mestri Mp3 Songs Free Download 1993 Telugu Movie ChiranjeeviMuta Mestri  (1993) - NaaSongs.Com.Co

ఈ క్రమంలో సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఎట్టకేలకు సినిమా రిలీజై.. చిరు డైలాగ్ డెలివరీ, నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆడియన్స్ సినిమాను ఎన్నిసార్లు అయినా చూడవచ్చు అని ఫీల్ తో సినిమాకు క్యూ కట్టారు. అలా ఈ సినిమా టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ మసాలా సినిమాగా నిలిచిపోయింది. ఇక అప్పట్లోనే సినిమాని ఏకంగా 200 థియేటర్లలో రిలీజ్ చేశారు. మొదటిరోజు కాకినాడ దేవి థియేటర్లలో అయితే స్పెషల్ పర్మిషన్లు తెచ్చుకున్నారు. ఏకంగా తొమ్మిది షోలను రిలీజ్ చేశారు. అలా మొదటి వారంలోనే ఈ సినిమా కోటిన్నర షేర్‌వ‌సూళ‌ను కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది.