శోభిత ధూళిపాళ్ల ఇంట మొదలైన పెళ్లి పనులు.. సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సమంత..

అక్కినేని హీరో నాగ చైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య మనస్పర్ధలు కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే తర్వాత నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లతో సీక్రెట్ డేటింగ్ చేశాడు. ఇటీవల ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు. వీరు నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే వీరు పెళ్లికి సంబంధించిన కీలక అప్ డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది.

Sobhita Marriage: పెళ్లికూతురు కాబొతున్న శోభితా..జోరుగా హల్దీ వేడుక పనులు..  నాగచైతన్య మ్యారేజ్ ఎప్పుడంటే? | Sobhita Dhulipala in Haldi Function  Preparations before Marriage with ...

త్వరలోనే వీరి వివాహం గ్రాండ్ లెవెల్‌లో జరగబోతుందని సమాచారం. ఈ క్రమంలోనే శోభిత ధూళిపాళ్ల ఇంట‌ పెళ్లి పనులు ప్రారంభమైపోయాయి. దీనిలో భాగంగా శోభిత ఇంట హల్దీ ఫంక్షన్ గ్రాండ్ లెవెల్ లో జరిగింది. పసుపు కొట్టే ఈవెంట్లో అమ్మడు ఫోటో స్టిల్స్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్లో శోభిత దూళిపాళ్ల కుటుంబమంతా పాల్గొని సంద‌డి ఛేశారు. ఇక శోభిత చెల్లెలు సమంత శోభిత నిశ్చితార్థానికి దూరంగా ఉన్నా.. పసుపు కొట్టే ఫంక్షన్ లో మాత్రం సందడి చేసింది.

ఇక సమంత వృత్తిపరంగా డాక్టర్. బోర్సిలోనా యూనివర్సిటీల తన డాక్టర్ చదువును పూర్తి చేసుకుని.. రేడియో రోగనిరోధక విభాగంలో ఎండిగ వ్యవహరిస్తుంది. అయితే సమంత ధూళిపాళ్ల తన అక్క కంటే ముందే పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైంది. ఈ క్రమంలోనే నిశ్చితార్థానికి రాలేకపోయినా స‌మంత.. పెళ్లి వేడుకల్లో మాత్రం సందడి చేసింది. స్వదేశానికి వచ్చి సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. ఇక వీరిద్దరూ కలిసి స్టిల్స్ ఇచ్చిన ఫోటోలను శోభిత దూళిపాళ్ల తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది. పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలను కూడా అమ్మడు అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింట వైరల్‌గా మారుతున్నాయి.

sobhita Dhulipala Haldi Function : நாக சைதன்யாவை கரம்பிடிக்க ரெடியான  சோபிதா; களைகட்டிய ஹல்தி கொண்டாட்டம்!