ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక మందన హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పుష్ప కు సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప 2.. డిసెంబర్ 6న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియోస్, పాటలు అన్ని సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని బన్నీ అభిమానులు తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బని అభిమానులే కాదు.. చాలామంది సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 90% షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ సినిమా.. మరో రెండు వారాల్లో గుమ్మడికాయ కొట్టనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా సినిమా విషయంలో బ్యాడ్ సెంటిమెంట్ అభిమానులను కలవరపెడుతుంది.
గతంలో సుకుమార్ డైరెక్షన్లో హీరోగా బన్నీ నటించిన ఆర్య సినిమా మంచి సక్సెస్ అందుకున్నా.. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఆర్య 2 ఆ రేంజ్ లో సూపర్ హిట్ అందుకోలేకపోయింది. దీంతో మరోసారి సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ సీక్వెల్ నటిస్తుండడంతో.. పుష్ప 2కి అదే బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అంటూ కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. సెంటిమెంట్ రిపీట్ కాకూడదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.