నడిరోడ్డుపై డ్యాన్స్ వేస్తూ అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

కోల్‌క‌త్తా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన మొత్తం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశ నలుమూలల నుంచి యువతులతో పాటు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది ఈ ఘటనను ఖండిస్తూ యువ డాక్టర్లు సైతం నిరసన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ నడిరోడ్ పైకి వచ్చి డ్యాన్స్ చేసి అవేర్నెస్ కల్పించింది.

మామూలుగా హీరోయిన్స్ అంటే ఈవెంట్స్, ప్రమోషన్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఇలాంటి సమయంలోనే బ‌య‌ట మెరుస్తూ ఉంటారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసి కామ్ అయిపోతారు. కానీ.. ఈ హీరోయిన్ మాత్రం అలా కాదు. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రజలతో కలిసి రోడ్డుపైకి వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిరసన తెలుపుతూ డ్యాన్స్ కూడా వేసింది. దీంతో ఆమెపై నెటిజ‌న్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ సెలబ్రెటీస్ కూడా ఇలా బయటకు వచ్చి తమ నిరసనలు తెలిపితే ప్రభుత్వం మ‌రింత త్వరగా పనిచేస్తుందని.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ఆ రోడ్ పైకి వచ్చి డ్యాన్స్ చేసిన హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా. ఆమె మోక్షసేన్ గుప్తా.

బెంగాల్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికి నటిస్తూనే ఉంది. నీతోనే నేను, అలనాటి రామచంద్రు, ఐ హేట్ యు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక తాజాగా కమెడియన్ ధనరాజ్, సముద్రఖ‌న్ని ప్రధాన పాత్రలో నటించిన రామం రాఘవంలోనూ మోక్ష సేన్‌ నటించి మెప్పించింది. ఈ క్రమంలో హీరోయిన్ హోదాలో ఉన్న మోక్ష సైన్ గుప్తా ఇలా బెంగళూరు నడిరోడ్డు పై నృత్యం చేసి నిరసన వ్యక్తం చేస్తున్న వీడియో నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలో ఆమెలానే మిగతా సినీ సెలబ్రిటీస్ కూడా బయటకు వచ్చి.. తమ నిరసనలు తెలిపితే ఈ కేసు కాస్త వేగంగా ముందుకు వెళుతుందని.. ఆమెను చూసి మీరు కూడా బయటకు రావాలంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు జ‌నం.

Ongoing protests in Kolkata after the rape and death of the doctor at #RGKarMedicalCollegeHospital has created a kind of history in creative thinking, planning and execution of the street protests. It reminds some of the protests at Shaheen Baug in New Delhi.

Kolkata is taking… pic.twitter.com/y657zHDmq0

— Sheela Bhatt शीला भट्ट (@sheela2010) September 16, 2024