నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా మూవీ దేవర.. త్వరలోనే ఆడియోస్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత.. ఎన్టీఆర్‌కు కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు ఏర్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో తారక్ నుంచి వస్తున్న మొదటి సోలో సినిమా కావడంతో.. ప్రేక్షకుల్లో అంచనాలు తారస్థాయికి చేరాయి. ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ అభిమానులంతా తెగ ఆరాట పడిపోతున్నారు. అయితే సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన థర్డ్ సింగిల్, థియేట్రికల్ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకున్నా.. వీటినుంచి వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ఫ్యాన్స్‌ను కాస్త నిరాశపరిచాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో సినిమా సక్సెస్ పై కొత్త సందేహాలు మొదలయ్యాయి.
అయితే లేటెస్ట్‌గా సినిమా గురించి వైరల్ అవుతున్న వార్తలు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇంతకీ ఆ న్యూస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మొదటి నుంచి జక్కన్న.. తారక్‌కు అత్యంత ఆప్త మిత్రుడు అన్న సంగతి అందరికీ తెలుసు. వీళ్ళు మంచి స్నేహితులే కాదు.. అంతకుమించి ఇద్దరు అన్నదమ్ముల్లా ఉంటారు. రాజమౌళి.. ఎన్టీఆర్ పై అభిమానంతో ఏకంగా నాలుగు సినిమాలను ఆయనతో తెరకెక్కించాడు. ఇక జక్కన్నతో ఎన్టీఆర్‌కు ఉన్న చనువుతో దేవర సినిమా విషయంలో తారక్ అయనను ఓ కోరిక కోరాడట. ఆ సినిమా ఫైనల్ కాపీని చూసిన తర్వాత ఏమైనా సన్నివేశాలు అవసరం లేదంటే తొలగించేందుకు హెల్ప్ చేయాలని.. ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా ఎడిటింగ్ విషయంలో కొంచెం చొరవ తీసుకోవాలని రాజమాళిని ఎన్టీఆర్ అడిగాడట.
అందుకు రాజమౌళి కూడా సరే అన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ తో పాన్ వరల్డ్ సినిమాకు సిధ్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాపై ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా గడుపుతున్న జక్కన్న.. ఇంత బిజీ లోను తారక్ అడగగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. సినిమా సెన్సార్ పూర్తయినా.. ఏకంగా నడివి 3 గంటల 10 నిమిషాలు ఉండడం సినిమాకు అసలు మంచిది కాదని.. ఎన్టీఆర్ భావిస్తున్నారట. ఇక ఇప్పటికే సినిమా కథకు అడ్డంగా ఉందని దావూదీ సాంగ్ సినిమా నుంచి తొలగించినట్లు సమాచారం. రోలింగ్ టైటిల్స్ టైంలో ఈ సాంగ్ పెట్టాలని భావించినా.. ఏవో కారణాలతో ఇప్పుడు సాంగ్ నే పూర్తిగా తీసేసినట్లు తెలుస్తుంది. ఇక జక్కన్న పర్యవేక్షణలో ఎడిటింగ్ చేయించి మార్పులు, చేర్పులు చేసిన తర్వాత సినిమాను రిలీజ్ చేయనున్నారట.