మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మైల్డ్ స్టోన్ మూవీ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఖైదీ. బి.కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాల్లో చిరంజీవి నటన అద్భుతం అనే చెప్పాలి. ఈ మూవీలో హీరోయిన్గా మాధవి నటించింది. అయితే చిరంజీవితో మాధవి అప్పటికే పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య, రోషగాడు, చట్టంతో పోరాటం, ఖైదీ లాంటి సినిమాల్లో ఈ జంట కలిసి నటించి మెప్పించారు. ఇక ఖైదీలో వీరిద్దరి రొమాన్స్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే మాధవి మాతృదేవోభవ లాంటి క్లాసికల్ సినిమాల్లోను ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1990లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. 1996లో యూఎస్ కు చెందిన రోల్ఫ్ శర్మ అనే ఫార్మా కంపెనీ అధినేతను వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
యూఎస్‌లోనే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం యుఎస్ లో ఉన్న మాధవి.. భర్త వ్యాపారాల్లో ఆమె సహాయాన్ని అందిస్తుంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాధవి మాట్లాడుతూ పెళ్ళికి ముందు తన భర్తకు పెట్టిన ఒక కండిషన్ గురించి వివరించింది. పెళ్లయ్యాక తన సినిమాలు ఒక్కటి కూడా భర్త చూడకూడదని కండిషన్ పెట్టినట్లు చెప్పుకొచ్చింది. దానికి ఒక కారణం ఉందని.. నా భర్త నన్ను సాధారణ అమ్మాయిగానే చూడాలి. నా సినిమాలు చూసి నేను పెళ్లి చేసుకుంది సెలెబ్రెటీనా.. అనే ఫీలింగ్ ఆయనకు రాకూడదు.. ఆ భయంతోనే నేను సినిమాలు చూడకూడదని కండిషన్ పెట్టా అంటూ మాధవి వివరించింది.
ఒకవేళ ఎవరైనా మీ భార్య నటించిన సినిమాలు చూశారా అని అడిగితే మాత్రం చూశానని చెప్పేయండి అన్నానని.. కానీ మాతృదేవోభవ సినిమాని నేనే ఆయనకు చూపించాను అంటూ వివరించింది. ఆయన ఆ సినిమా చూస్తున్నప్పుడు నేను సిగ్గుతో మొఖం దాచేసుకున్నానని.. నటిగా నన్ను చూసీ అయన ఎలా ఫీలవుతారు అని నాకు అప్పుడు చాలా భయంగా ఉంది.. ఇక ఆయన ఆ సినిమా చూసిన తర్వాత నువ్వు చాలా మంచి నటివి అని నన్ను ప్రశంసించారంటూ వివరించింది. ఇక ప్రస్తుతం మాధవి ఓ వైపు పిల్లలను, తన భర్తకు ఉన్న ఫార్మా కంపెనీల బిజినెస్లను చూసుకుంటూ బిజీగా గడుపుతుంది. ఇక తన పిల్లల్లో ఒకరైన ఇండస్ట్రీకి అడుగుపెట్టి నటిగా మారితే చాలా సంతోషం అంటూ తను వివరించింది.