సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. రొమాన్స్, ఎఫైర్స్ లాంటివని చాలా కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. సౌత్‌తో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి మరింత ఎక్కువ. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్‌ల మధ్యన ఎప్పటికప్పుడు రూమర్లు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడున్న హీరో, హీరోయిన్లు అందరూ ఒకరితో రిలేషన్ మెయింటెన్ చేసి.. మరొకరిని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. అయితే ఓ హీరోయిన్ ఇద్దరు హీరోలు గాఢంగా ప్రేమించారని.. వలలో హీరో తనకోసం.. ఆమె ప్రేమ వల్ల తన కెరీర్‌ను కూడా నాశనం చేసుకున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
ఆ హీరో మరెవరో కాదు వివేక్ ఒబెరాయ్. బాలీవుడ్ లో ఒకప్పుడు సూపర్ క్రేజ్‌ను సంపాదించుకుని దూసుకుపోయిన వివేక్ ఒబెరాయ్.. సురేష్ ఒబెరాయ్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక.. కంపెనీ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. నటించినది చాలా తక్కువ సినిమాలైనా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇదే టైంలో ఇండస్ట్రీకి వచ్చిన ఐశ్వర్యరాయ్‌తో ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరూ కలిసి చాలా కాలం డేటింగ్ కూడా చేశారు. పార్టీలు, పబ్‌లు అంటూ తమ రిలేషన్‌ను బహిరంగంగానే అనౌన్స్ చేశారు. అయితే అదే టైంలో బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఐశ్వర్యతో క్లోజ్ గా ఉండేవారు.
దీంతో కోపంతో వివేక్ ఒబేరాయ్.. సల్మాన్‌ను బహిరంగంగా విమర్శలు చేశాడు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా వివేక్ ను బెదిరించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఘటన తర్వాత ఐశ్వర్యరాయ్, వివేక్ ఒబెరాయ్ కు బ్రేకప్ చెప్పి.. సల్మాన్ తో రిలేషన్ మెయింటైన్ చేసింది. అయితే వీరి బంధం కూడా మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలింది. జింకను చంపేసిన కేసులో సల్మాన్ జైలుకు వెళ్లడంతో.. ఐశ్వర్య అతని దూరం పెట్టింది అదే టైంలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఇద్దరు వరుస సినిమాల్లో నటించడం.. ఈ క్రమంలో ప్రేమ చిగురించడం.. ఈ జంట పెళ్లి చేసుకోవడం జరిగాయి. ఐశ్వర్యతో బ్రేకప్ తర్వాత వివేక్ ఒబెరాయ్ పెళ్లి చేసుకోలేదు, సల్మాన్ ఖాన్ కూడా ఇప్పటికీ సింగిల్గానే ఉంటున్న సంగతి తెలిసిందే.