టాలీవుడ్ గెలవాలంటే ఎన్టీఆర్ ఆ పని చేయాల్సిందేనా

టాలీవుడ్ సినిమాల రేంజ్ రోజుకు పెరిగిపోతుంది. పాన్ ఇండియా నుంచి పాన్ వ‌రల్డ్‌ స్థాయికి మన సినిమాలు ఎదగనున్నాయంటూ.. ఎప్పటికప్పుడు గొప్పలు పోవడమే కానీ.. మన సినిమాలలో ఎన్ని సినిమాలో సక్సెస్ అందుకుంటున్నాయి.. టాలీవుడ్ సక్సెస్ రేట్ ఎందుకు ఇంతలా తగ్గిపోతుందన్నది మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రేక్షకులు మెల్లమెల్లగా థియేటర్లకు రావడం తగ్గిపోతుంది. ఇది స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెండితెర‌లో వెలుగులు కూడా కనుమరుగుతున్నాయి. పెద్ద సినిమాలు వచ్చి వాటికి మంచి టాక్ వస్తే తప్ప ఎక్కువ రోజులు థియేటర్లలో సినిమా నిలవని ప‌రిస్థితి. ఇక ఈ సినిమాలకు ముందుగానే సోషల్ మీడియా వేదికగా మంచి క్రేజ్ వస్తున్నా.. అదే సోషల్ మీడియా వేదికగా నెగెటివిటీ తప్పట్లేదు.

Devara' audio rights sold for Rs 27 crores - Pakka Telugu

స్టార్ హీరోల అభిమానుల మధ్య నిత్యం జరిగే గొడవల కారణంగా ఫ్యాన్స్ అంత తమ హీరోలకు అతని సినిమాలకు ఎలివేషన్ ఇవ్వడం కంటే ఎదుటి హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు నెగెటివిటీ పెంచేందుకు ఎక్కువగా కష్టపడుతున్నారు. ఆ హీరో సినిమాను కించపరచడానికి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడది సినిమాల సక్సెస్ రేట్ విపరీతంగా తగ్గిపోయి ఇబ్బందుల్లో చిక్కుకుంది టాలీవుడ్. ఈ క్రమంలోనే వచ్చే మూడు నెలల్లో టాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలు బాగా ఆడి ఇండస్ట్రీ లో సక్సెస్ అందుకుంటే తప్ప.. టాలీవుడ్ మనుగడ సాగని పరిస్థితిలోకి తెలుగు ఇండస్ట్రీ వచ్చేసింది. ఇంతకీ ఆ మూడు సినిమాలేవో చెప్పలేదు కదా.. దేవర, పుష్ప 2, గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాలు బాగా ఆడితేనే టాలీవుడ్‌ఖు సక్సెస్ అందుతుంది.

Pushpa 2 Release Date, Trailer and More

ఈ క్రమంలోనే సినిమాలకు భారి పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కొండంత ఆశలతో ఉన్నారు. ప్రస్తుతం అందరి దృష్టి దేవరపై ఉన్న సంగతి తెలిసిందే. మూవీ ట్రైలర్ కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. నెగెటివిటీ ఇంకా ఇంకా పెంచి సినిమాలను ఫ్లాప్ చేసేలా సోషల్ మీడియాలో పలువురు పనిచేస్తున్నారు. అయితే ఇదే ధోరణితో దేవరను డామేజ్ చేస్తే తర్వాత తమ అభిమాన హీరో సినిమాలను ఎన్టీఆర్ అభిమానులు లక్ష్యంగా తీసుకుంటారని సందేహం లేదు.

Game Changer: మెగా పవర్ స్టార్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్..  అదేంటంటే - Telugu News | Interesting update on Ram Charan Game Changer  Movie | TV9 Telugu

ఈ క్రమంలో ఇద్దరు సినిమాలకు నష్టం వాటిల్లడమే కాదు.. టాలీవుడ్ కు కూడా తీవ్ర నష్టం ఏర్పడుతుంది. కనుక దేవరపట్ల నెగెటివిటీ తగ్గించడం అవసరం. ఈ క్రమంలో దేవర సక్సెస్ ఎన్టిఆర్ కే కాదు.. టాలీవుడ్కు కూడా చాలా అవసరం. దేవరకు మంచి ఆరంభం వస్తే సినిమా బాగా ఆడి సక్సెస్ అందుకుంటే.. ఇండస్ట్రీకి మంచి వైబ్స్ వ‌స్తాయి. సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాగా అడిగితే టాలీవుడ్ పేరు మరోసారి వెలుగులోకి వస్తుంది. అప్పుడు పుష్ప2, గేమ్ ఛేంజర్‌ సినిమాలకు ఈ సక్సెస్ మరింత ప్లస్ అవుతుంది. అవి బాగా సక్సెస్ అందుకుంటే ఈ ఏడాది ఇండస్ట్రీలో టాలీవుడ్ ఆ నెంబర్ వన్ గా నిలుస్తుంది. కనుక నెగెటివిటీ పక్కన పెట్టి దేవర బాగా సక్సెస్ అందుకోవడానికి టాలీవుడ్‌ను గెలిపించడానికి ఎన్టీఆర్ ఎలాంటి ప్లాన్ చేస్తాడో వేచి చూడాలి.