మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తాజా మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఎప్పటికప్పుడు మూవీ టీం పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచుతున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది.
ఈ క్రమంలోనే తాజాగా దేవర తమిళ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఎన్టీఆర్.. ఓ తమిళ దర్శకుని బ్రతిమలాడుకున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. అసలు ఎన్టీఆర్ ఆ దర్శకుడిని అంతలా ఎందుకు రిక్వెస్ట్ చేసుకున్నాడు ఒకసారి తెలుసుకుందాం. తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో వైవిధ్యతను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వెట్రిమారన్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో దాదాపు స్టార్ హీరోస్ అంతా వెట్రిమారన్‌తో సినిమా చేయాలని ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి తారక్ కూడా చేరిపోయాడు. ఎన్టీఆర్ స్వయంగా వెట్రిమోరన్ సార్‌తో సినిమా చేయాలని ఉంది.. సార్ ప్లీజ్ నాతో సినిమా చేయండి అంటూ స్టేజిపై కామెంట్స్ చేశారు. మొదటి సినిమా డైరెక్ట్ తమిళ్లో చేసి తెలుగులో డబ్ చేద్దామని ఎన్టీఆర్ అన్నారు.
ఇక గతంలో డైరెక్టర్ వెట్రిమారన్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందంటూ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేవర ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ వెట్రిమారన్‌ను ఉద్దేశిస్తూ రిక్వెస్ట్ చేసిన వీడియో నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. దీంతో కోలీవుడ్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బ్లాక్ బస్టర్ పక్కా అంటూ.. కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ నుంచి వస్తున్న దేవర రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఈనెల సెప్టెంబర్ 27న దేవర మొదటి భాగం గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇప్పటికే పలుచోట్ల బుకింగ్స్ ఓపెనై రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. మరెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.