సావిత్రి మెడలో పూలదండకు వేలం పాట.. ఎన్ని లక్షలు వచ్చాయంటే..?

టాలీవుడ్ మహానటి సావిత్రికి.. తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సావిత్రి.. ఎంత మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ అమ్మడు చేయని పాత్ర ఉండదనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది మహామహుల సినిమాల్లోను నటించి స్టార్ హీరోయిన్‌గా అప్పట్లో ఓ వెలుగు వెలిగిన సావిత్రి.. నటనకు దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, ఎస్వి రంగారావు లాంటి వాళ్లు కూడా అవాక్క అయ్యేవారు. ప్రసంశల వర్షం కురిపించేవారు.

ఎన్టీఆర్ - ఏఎన్నార్ లకు చుక్కలు చూపించిన నటుడు ఎవరు..? ఆయనంటే ఎందుకు  భయపడేవారు..?

ఇక గుంటూరు జిల్లా చిరావూరు గ్రామంలో ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వచ్చిన సావిత్రి.. చిన్నతనంలోనే తండ్రి పోవడంతో పెదనాన్న కొమ్మరెడ్డి వెంకటరామయ్య దగ్గర పెరిగింది. అయితే తనకు న‌ట‌న‌పై ఉన్న ఆసక్తితో నాటక రంగంలోకి అడుగుపెట్టిన సావిత్రి.. హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకుంది. తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాస్ వచ్చి చిన్న పాత్రలతో తన కెరీర్‌ ప్రారంభించి తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగింది.

Mahanati Savitri Birth Anniversary: నటనను ఆరాధించిన మహానటి - సావిత్రి జయంతి  సందర్భంగా పింక్ విల్లా ప్రత్యేక కథనం.

ఇక ఈ అమ్మ‌డుకి ధాన గుణం కూడా ఎక్కువే. ఎన్నో ధానాలు చేసిన సావిత్రి.. అప్ప‌ట్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విపత్తుల‌ కోసం కొంత నిధిని సేకరించి ఇచ్చింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు గారు ఉన్నారట. ఈ క్రమంలోనే విపత్తు నిధికి సినిమా వాళ్లు స్పందించకపోవడంతో.. సీఎం నరసింహారావు.. సావిత్రి మెడలోని పూలదండలు వేలంపాట వేసాడట. ఆ పూలోమాలను కొనడం కోసం జ‌నం ఎగబడ్డారు. చివరకు అప్పట్లోనే ఆ మాల‌కు ఏకంగా రూ.30 వేలు వచ్చేయట. అప్పుడు రూ.30వేలు అంటే ఇప్పుడు దాదాపు రూ.30 లక్షల కన్నా ఎక్కువ. అలాగే ఈ విప‌త్తు కోసం ప్రభుత్వానికి కూడా అప్పట్లో ఎన్నో విరాళాలు ఇచ్చిందట సావిత్రి. ఈ విషయాలు మరో సీనియర్ నటి జమున ఓ ఇంట‌ర్వ్యూలో వివరించింది.