కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సెప్టెంబర్ 27న రిలీజై మొదటి రోజునే భారీ ఓపెనింగ్స్‌తో రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలో దేవర మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందంటూ అభిమానులు ఆసభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు కూడా ఇలానే కొనసాగితే.. మరిన్ని రికార్డులు తారక్ ఖాతాలో పడతాయి అనడంలో సందేహం లేదు. ఇక గతంలో రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ నటించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో.. ఎన్టీఆర్ అభిమానులేకాదు.. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులు అంతా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ దేవరపై భారీ అంచనాలను పెంచుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ని కూడా విడుదల ముందు వరకు మూవీ యూనిట్ జోరుగా కొనసాగించడం విశేషం. ఇలా ఎన్టీఆర్ తమిళ్, బాలీవుడ్ ఇండస్ట్రీ అని లేకుండా అన్ని భాషల్లోనూ తన మాటలతో అభిమానులను ఆకట్టుకున్నాడు.
ఇక సందీప్ రెడ్డి వంగతో ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే దేవర ప్రతి ప్రమోషన్ లోను ఎంతోమంది పాల్గొన్నా.. ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కళ్యాణ్ రామ్ ఈ ప్రమోషన్స్ లో పాల్గొనక పోవడం అందరికీ షాక్ ఇచ్చింది. కేవలం ప్రొడ్యూసర్ గానే కాదు.. తారక్ సొంత అన్నయ్య అయినా కళ్యాణ్ రామ్ ఒకటంటే ఒక ప్రమోషన్ లో కూడా అటెండ్ కాలేదు. అది కూడా ఈ రేంజ్‌లో పాన్ ఇండియన్ సినిమా కావడంతో.. అభిమానుల్లో కొన్ని సందేహాలు మొదలయ్యాయి. అంతకుముందు ఎన్టీఆర్ కెరీర్ మొదట్‌లో కొన్ని రోజులు అన్నదమ్ముల మధ్య మాటలు లేవంటూ పుకార్లు వినిపించాయి.
అయితే వాటికి చెక్ పెడుతూ వీరిద్దరూ కలిసి మెలిసి తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా ఏకంగా ఎన్టీఆర్ పాన్ ఇండియన్ సినిమాకు ప్రొడ్యూసర్‌గా కళ్యాణ్ రామ్ వ్యవహరించారు. అయితే మళ్లీ ప్రమోషన్స్‌లో పాల్గొనక పోవడానికి కారణం ఏంటి అంటూ అభిమానుల సందేహాలు మొదలయ్యాయి. కాగా కళ్యాణ్ రామ్ తన సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం కారణంగానే.. దేవర ప్రమోషన్ కార్యక్రమాలకు అటెండ్ కాలేకపోయారని సమాచారం. అంతేకాదు ఇక ఈ సినిమా తెలుగు ప్రీమియర్‌లో ఈవెంట్ జరగలేదు. దీంతో కళ్యాణ్ రామ్‌కు ఇక్కడ ప్రమోషన్లను పాల్గొనే అవకాశం రాలేదు. ఫ్యూచర్లో ఒకవేళ సక్సెస్ మీట్ జరిగితే కనుక తప్పకుండా కళ్యాణ్ రామ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.