ఇక ఆ హీరోతో జీవితంలో సినిమా తీయలేను.. కొరటాల షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్‌లలో ఒకరిగా కొరటాల శివ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మొదట బోయపాటి దర్శకత్వంలో తను ఎన్నో సినిమాలకు రచయితగా వివరించినా.. ప్రభాస్ మిర్చి సినిమాతో దర్శకుడుగా మారి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా వరుసస్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్‌లు అందుకొని టాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే తర్వాత మెగాస్టార్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెర‌కెక్కిన‌ ఆచార్య డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న కొరటాల.. తన పని అయిపోయిందని అందరూ అనుకున్నా.. కసితో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను రూపొందించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది.

Allu Arjun announces new film 'AA21' helmed by Koratala Siva – India TV

మిడ్ నైట్ షో నుంచి తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలు పెట్టేసారు. ఈ క్రమంలో ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను కొరటాల ఏమాత్రం అందుకోలేకపోయాడు. ఫస్ట్ ఆఫ్ పర్వాలేదనిపించిన.. సెకండాఫ్ పూర్తిగా డీలా పడిపోయింది. క్లైమాక్స్ అస్సలు నచ్చకపోవడంతో.. చాలామంది నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో యావరేజ్ టాక్‌ తెచ్చుకుంది సినిమా. దీంతో సినిమా ఫుల్ రన్‌లో బ్రేక్ ఈవెన్ అయితే కచ్చితంగా జరుగుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గతంలో కొరటాల.. దేవర ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడిన మాటలు నటింట వైరల్ గా మారుతున్నాయి కొరటాల మాట్లాడుతూ అల్లు అర్జున్‌తో కచ్చితంగా మూవీ ఉంటుందని.. కొంతమంది బన్నీ సినిమాలు క్యాన్సిల్ చేసి అదే కథతో దేవర తీసామని అనుకుంటున్నారు.

Paritala Character in Pawan Movie! | cinejosh.com

అందులో ఎలాంటి నిజం లేదు. అల్లు అర్జున్ స్టోరీ వేరే ఉంది. మాకు ఆలస్యం కారణంగా సినిమా క్యాన్సిల్ అయింది. కచ్చితంగా ఆ సినిమాకి వస్తుందంటూ వివరించాడు. ఇండస్ట్రీలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమా చేశారు.. పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు నటిస్తారని ఇంట‌ర్వ్యూవ‌ర్ ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలని నాకు ఎప్పటినుంచో ఉంది. కానీ.. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో రాణిస్తున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అవి రిలీజ్ అయిన తర్వాత అసలు సినిమాల్లో నటిస్తారో.. లేదో.. కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే కష్టమే అంటూ కొరటాల వివరించాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెటింట హాట్ టాపిక్‌గా మారాయి.