‘ దేవర ‘లో ఈ చిన్న మిస్టేక్స్ జరగకపోతే పాన్ ఇండియన్ హిట్ అయ్యేదా..?

నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కారటాల శివ కాంబినేషన్‌లో దేవర పార్ట్ వన్ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ పాత్రలో కనిపించాడు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో, జాన్వీ కపూర్ గ్లామర్ రోల్‌ల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇంత స్టార్ కాస్ట్‌ను తీసుకొని సినిమా తెరకెక్కించడమే కాదు.. మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా కనిపించేలా ఖర్చు చేసి మరి తెర‌కెక్కించారు. ఎంతో టైంను కేటాయించారు. అయినా సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఎన్టీఆర్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. అనిరుధ్‌ మ్యూజిక్ ప్రేక్షకులు మెప్పించినా.. సినిమా మాత్రం యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది.

Devara: Part 1 | Movie Release, Showtimes & Trailer | Cinema Online

కారణం కొరటాల శివ రాసిన రొటిన్‌ స్టోరీ అంటూ పూర్‌ డైరెక్షన్ కారణంగానే సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది అంటూ కామెంట్‌లు వినిపిస్తున్నాయి. సినిమా ఫస్ట్ ఆఫ్ చాలా స్లోగా అనిపించింది.. ఇంటర్వెల్ బ్యాక్ సన్నివేశాలు కాస్త ఓకే అనిపించడంతో.. సెకండ్ హాఫ్ ను ఇంట్రెస్టింగా హైలెట్ చేసేలా కొరటాల తెర‌కెక్కించి ఉంటాడని అంతా భావించారు. కానీ.. సెకండ్ హాఫ్ పూర్తిగా నిరాశపరిచింది అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉండడం వల్ల.. ప్రేక్షకులకు నిరాశ ఎదురయింది. సెకండ్ హాఫ్ మొత్తంలో వావ్ అనిపించేలా.. ఆడియన్స్ నుంచి విజిల్స్ పడేలా ఒక్క మూమెంట్ కూడా లేకపోవడంతో.. ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది.

Devara Second Single Release Date And Time Revealed: Jr. NTR's Movie Song  Coming Soon - Filmibeat

దేవర పార్ట్ 2లో మిగతా సినిమాను ఇంట్రెస్టింగ్ గా చూపించాలనే ఉద్దేశంతో.. పార్ట్ 1 సెకండ్ హాఫ్ ను అలా చేసేసాడు కొరటాల. ఈ కారణంగానే పాజిటివ్ రివ్యూస్ ఎన్నైతే వచ్చాయో.. నెగటివ్ కూడా అదే రేంజ్ లో రావడంతో.. యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది దేవర. శివ చేసిన తప్పుల వల్ల దేవర సినిమాకు ఇప్పుడు ముప్పు వచ్చినట్లు అయింది. కొరటాల సినిమా చేసేట‌ప్పుడు.. ఈ తప్పులను సరి చేసుకున్నట్లయితే పాన్ ఇండియా రేంజ్‌లో దేవర వేరే లెవెల్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునేది. అలానే సినిమాలో ఫస్ట్ అఫ్ స్టోరీని.. సెకండ్ హాఫ్ లో పెట్టి సెకండ్ హాఫ్ స్టోరీని ఫస్ట్ ఆఫ్ లో ఉంచి ఉన్నా మంచి విజయం దక్కేది. అలా స్వైప్ చేసి కథలు తెర‌కెక్కించినా బాగుండేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన జాన్వి కపూర్ పాత్రకు అసలు ఇంపార్టెన్స్ ఏ ఉండదు.

Devara Movie Review

ఆ పాత్ర ఉన్నా.. లేకపోయినా.. పెద్ద నష్టం ఉండదు అన్నట్లుగా సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఓ హీరోయిన్ ఉండాలి. ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయాలి.. అది ఓ స్టార్ హీరోయిన్ అయితే అందరి అట్రాక్షన్ సినిమాపై ఉంటుందన్న ఉద్దేశంతో మాత్రమే జాన్విని తీసుకున్నట్లు అనిపించింది. కథ కొత్తద‌నం చూపించి ఉంటే పాన్ ఇండియా సినిమా తీద్దామని కొరటాల ప్రయత్నానికి సక్సెస్ అందేది. ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం డబ్బులు ఖర్చు చేశారు. కానీ క్వాలిటీ గ్రాఫిక్స్ అంతగా కనిపించలేదు. సముద్రం రియల్స్టిక్‌గా అనిపించలేదు. ఏదో స్విమ్మింగ్ పూల్ లో సెట్ వేసి మమా అనిపించినట్లు ఉంది అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే సెట్‌కు సంబంధించిన వీడియోలను బయటకు రిలీజ్ చేయడం.. రియల్ ఎస్టేట్ ఫీలింగ్ లేకుండా ఉండడానికి ఓ కారణం కావచ్చు.