బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ళక్ష తన అదిరిపోయే స్టాపులతో తనకొంటూ ప్రత్యేక క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య లో బాస్ పార్టీ సాంగ్‌లో తన మాస్టెప్పులతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోని ఈ బ్యూటీ ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ 109వ సినిమాలో నటిస్తుంది.
ఇదే క్రమంలో తాజాగా ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె బాలయ్య పై షాకింగ్ కామెంట్లు చేసింది. గతంలో రాధికా ఆప్టే కూడా బాలయ్యపై నెగిటివ్ గా కామెంట్స్ చేసింది. ఆమె బాలయ్యపై పాజిటివ్ గా కామెంట్స్ చేయడం విశేషం. బాలయ్య గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ విన్నాను. బాలకృష్ణ లెజెండ్ యాక్టర్ ఆయన పని పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉంటారు.
నాకు బాలకృష్ణ అంటే ఎంతో అభిమానం ఆయన కూడా ఇతరులను ఎంతో గౌరవిస్తారు. ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు నేను ఆనందంగా భావిస్తున్నాను.. ఆయన తన తోటి వారిని ఎంతో గౌరవిస్తారు. అయనతో కలిసి పనిచేసేటప్పుడు నేను ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.