దేవర సెకండ్ డే కలెక్షన్స్.. మిక్స్‌డ్‌ టాక్‌తో తారక్ రికార్డుల మోత..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన దేవర భారీ అంచనాల నడుమ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు మొదటినుంచి యావ‌రేజ్ టాక్ వినిపిస్తుంది. ప‌లువురు ఎన్టీఆర్ అభిమానుల సైతం.. ఈ సినిమా నిరాశ పరిచిందంటూ వెల్లడించారు. మొదటి రోజు బెనిఫిట్ షోలు భారీ ఎత్తున రిలీజ్ చేయడం కూడా సినిమాకు కాస్త నెగటివ్ అయింది. మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉన్న క్రమంలో.. ఆడియన్స్ అంచనాలను కొరటాల టచ్ చేయలేకపోయాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి క్రమంలో మిక్స్‌డ్‌ టాక్ తోనూ దేవర రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతుంది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దేవర కొల్లగొట్టింది. ఈ విషయాన్ని టీం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే కలెక్షన్స్ అప్డేట్ చేసే బాక్స్ ఆఫీస్ పోర్టల్ మాత్రం రూ.140 కోట్ల మాత్రమే వచ్చాయంటూ వెల్లడించాయి. ఆ రెండు నెంబర్స్ లో ఏది నిజమో తెలియదు కానీ.. మరోసారి ఎన్టీఆర్ స్టామినా ఈ సినిమాతో ప్రూవ్ అయింది. ఇక ఈ రేంజ్ లో మిక్స్డ్ టాక్ తోనూ మొదటిరోజు రూ.150 కోట్ల వరకు వసూలు సాధించడం సాధారణ విషయం కాదు.

Devara Part 1 Movie Review Jr NTR Saif Ali Khan Janhvi Kapoor Prakash Raj  Breathe Life Into Koratala Siva Film

అయితే రెండో రోజు కూడా దేవరకు అంత‌కుమించిన‌ కలెక్షన్లు రావడం విశేషం. మిక్స్డ్ టాక్‌తో నెగిటివ్ రివ్యూల తోనూ దేవర రెండో రోజు ఏకంగా రూ.243 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిందట. ఈ విషయాన్ని యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం విశేషం. ఇక‌ ఎన్టీఆర్ కారణంగానే సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ నెటింట‌ వైరల్ అవడంతో ఇది ఎన్టీఆర్ స్టామినా అంటూ.. దేవర దెబ్బకు ఆ మాత్రం కలెక్షన్స్ కామన్ అంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.