తాజాగా దుబాయ్ అబుదబీలో ఐఫా అవార్డ్స్ వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా ఐఫా ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. రీసెంట్గా బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తయిన క్రమంలో సినీ పరిశ్రమ తరపున గ్రాండ్గా సన్మానించారు. అలాగే ఐఫా అవార్డ్స్ వేదికపై కూడా బాలయ్యను గోల్డెన్ లెగిసి అవార్డుతో సత్కరించారు. ఈ క్రమంలో బాలయ్య ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో బాలయ్య పర్సనల్ సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ పై కూడా రియాక్ట్ అయిన బాలయ్య ఆ సినిమాకు సంబంధించిన కథ డిసెంబర్‌లో స్టార్ట్ అవుతున్నట్టు వివరించాడు.
ఇక స్టోరీ ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్నకు.. అది ఎలా చెబుతారు అంటూ ఫనీ కామెంట్స్ చేశాడు. ఇక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు. అఖండతో తెలుగు హిందుత్వ సినిమా నిర్దేశం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ కరోనా టైంలో సినిమాలు రిలీజ్ చేసామని.. మిగతా హీరో, దర్శకులు సినిమాలు రిలీజ్ చేయడానికి అప్పుడే ముందుకు వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. ఇక ఇంటర్వ్యువర్ తమ ఛానల్‌కు చీఫ్ ఎడిటర్‌గా మీ తర్వాత నందమూరి వారసుడిగా ఎవరు వ్యవహరిస్తారు అని అడగగా.. నా కొడుకు మోక్షజ్ఞతో పాటు నా మనవాళ్లు కూడా వ్యవహరిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక్కడ తన సొంత అన్నయ్య హరికృష్ణ కొడుకులు తారక్, కళ్యాణ్ రామ్ పేర్లు చెప్పకపోవడం నెటింట హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం పాన్ ఇండియ లెవెల్‌లో దూసుకుపోతున్నాడు. దేవర మొదటి రోజే ఏకంగా రూ.172 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ప్రశంసలు దక్కించుకుంది. ఇలాంటి క్రమంలో నందమూరి వారసుల పేర్లలో బాలయ్య ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు చెప్పకుండా కేవలం మోక్షజ్ఞ పేరును మాత్రమే ప్రస్తావించడంతో బాలయ్య కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కావాలనే ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ తారక్, కళ్యాణ్ రామ్ పేర్లు చెప్పకుండా కొడుకు పేరు మాత్రమే బాలయ్య చెప్పారు అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.